COVID 19 : కరోనా విలయం.. ఒక్కరోజే 31వేలకు పైగా కేసులు, 986 మరణాలు

కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా 31వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. 986 మంది కరోనాతో చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

COVID 19 : కరోనా విలయం.. ఒక్కరోజే 31వేలకు పైగా కేసులు, 986 మరణాలు

Covid 19

COVID 19 : కరోనావైరస్ మహమ్మారి రష్యాలో విలయతాండవం చేస్తోంది. అక్కడ కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా 31వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. 986 మంది కరోనాతో చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

రష్యాలో మంగళవారం 973 మంది కొవిడ్‌తో మరణించారు. బుధవారం 984 మంది ప్రాణాలు వదిలారు. తాజాగా మృతుల సంఖ్య మరింతగా పెరగడం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వైరస్‌ విజృంభణ కొనసాగుతుండటంతో దేశ ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండటానికి తోడు కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంతో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తూ వేలాది మంది ప్రాణాల్ని బలితీసుకుంటోంది. మాస్క్‌ ధరించాలన్న నిబంధనను గాలికొదిలేస్తుండటంతో వైరస్‌ మరింత విజృంభణకు కారణమవుతోంది.

Honey : టీలో తేనె కలుపుకుంటున్నారా! ఏం జరుగుతుందో తెలుసా?

రష్యా ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 31వేల 299 కొత్త కేసులు రాగా.. 986మంది మృతిచెందారు. కొన్ని వారాలుగా అక్కడ కొవిడ్‌ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. మొత్తంగా ఇప్పటివరకు 7.9 మిలియన్ల కేసులు నమోదు కాగా.. 2,20,315 మరణాలు సంభవించాయి. కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, మెక్సికో తర్వాత రష్యా ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Home Pollution : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

రష్యాలో 11లక్షల మందికి పైగా కరోనా రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర భారం పడుతోంది. కరోనా ముప్పు అధికంగా ఉన్న 65 ఏళ్లు పైబడిన వారిలో 42శాతానికి టీకా పంపిణీ జరిగింది. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ జన సమూహాల కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. థియేటర్లు, రెస్టారెంట్లతో పాటు ఇతర ప్రాంతాలకు టీకా తీసుకున్న వారితో పాటు కొవిడ్ నెగెటివ్‌ సర్టిఫికెట్ చూపించిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.