Covid-19 No Mask : అమెరికాలో మాస్క్ అక్కర్లేదు.. తప్పనిసరి నిబంధన ఎత్తివేత

కరోనాపై పోరులో అగ్రరాజ్యం అమెరికా విజయం దిశగా ముందడుగు వేసింది. కరోనాపై అమెరికన్ల యుద్ధం అంతిమ దశకు చేరుకుంది. అమెరికాలో ఇకపై మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తేవేసింది అమెరికా.

Covid-19 No Mask : అమెరికాలో మాస్క్ అక్కర్లేదు.. తప్పనిసరి నిబంధన ఎత్తివేత

Covid 19 U.s. Allows Fully Vaccinated People To Forgo Masks Indoors

No Mask for fully vaccinated people : కరోనాపై పోరులో అగ్రరాజ్యం అమెరికా విజయం దిశగా ముందడుగు వేసింది. కరోనాపై అమెరికన్ల యుద్ధం అంతిమ దశకు చేరుకుంది. అమెరికాలో ఇకపై మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తేవేసింది అమెరికా. రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) స్పష్టం చేసింది.

పూర్తిస్థాయిలో టీకా తీసుకుంటే మాస్క్ అవసరం లేదని బైడెన్ అన్నారు. అమెరికా చరిత్రలో ఇదే గొప్ప మైలురాయిగా బైడెన్ పేర్కొన్నారు. ఏడాదిన్నరగా మాస్క్‌లు ధరించాలని ప్రజలకు పదే పదే సూచించిన సీడీసీ నిబంధనలు సవరించింది. దీనిపై బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి టీకా డోసులు తీసుకున్న వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తిరగొచ్చునని స్పష్టం చేసింది. కరోనా కాలానికి ముందులానే స్వేచ్ఛగా జీవించవచ్చునని తెలిపింది.

కొవిడ్ టీకా రెండు డోస్‌లు తీసుకున్నవారు ఎవరైనాసరే బహిరంగ, అంతర్గత కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు.. మాస్క్ ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించాల్సిన
అవసరం లేదని సీడీసీ డైరెక్టర్ రోచెల్లీ వాలెన్‌స్కీ తెలిపారు. పూర్తిగా టీకాలు వేసుకున్నవారంతా ఎప్పటిలానే కార్యకలాపాలను ప్రారంభించవచ్చని తెలిపారు. అమెరికాలో
580,000 లక్షల మందిని కరోనా బలితీసుకుంది. ఇదో చరిత్రాక మైలురాయి.. చాలా గొప్ప రోజుగా బైడెన్ అభివర్ణించారు. అమెరికాలో దాదాపు 60 శాతం మంది పెద్దవారు
ఒకటి కంటే ఎక్కువ డోస్‌లు అందుకున్నారు. ఇప్పుడు 12-15 ఏళ్ల మధ్య చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.