అమెరికా మరో 9/11, పెరల్ హార్బర్ 2 దాడులకు సిద్ధంకావాల్సిందే. వైద్యనిపుణుల వార్నింగ్..

  • Published By: chvmurthy ,Published On : April 6, 2020 / 12:40 PM IST
అమెరికా మరో 9/11, పెరల్ హార్బర్ 2 దాడులకు సిద్ధంకావాల్సిందే. వైద్యనిపుణుల వార్నింగ్..

అమెరికావాసులు ఈ తరంలోనే అత్యంత బాధాకరమైన వారాన్ని అనుభవించబోతున్నారని అంటున్నారు వైద్య నిపుణులు. 9/11 దాడులు, పెరల్ హార్బర్ కన్నా దారుణమైన దాడిని… కరోనా పెను దాడిని అమెరికా ఎదుర్కోబోతోంది. సెప్టెంబర్ 11, పెరల్ హార్బర్ దాడులు, ఆదమరచినప్పుడు శత్రువు చేసిన ఎటాక్స్. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నం.

కరోనా కమ్మేస్తున్నట్లు  కనిపిస్తున్నా, ట్రంప్ టెంపరితనంతో అమెరికా కష్టాన్ని కొనితెచ్చుకుందా అన్న అనుమానం అందరిది. కరోనా దెబ్బకు అమెరికా 10మందిని కోల్పోతోందన్న అంచనాల మధ్య, కరోనా శిఖరాన్ని చేరింది. ఇక తగ్గడమేనని అధ్యక్షుడు ట్రంప్ ఆశపడుతున్నారు.

Surgeon General Vice Admiral Jerome Adams అంచనాలో ఈ వారం అమెరికా దారుణాన్ని చూడబోతోంది. “very very difficult”దేశానికి ఇది కష్టకాలమని ట్రంప్ వ్యాఖ్య తర్వాత  ఆయన హెచ్చరిక ఇది. కరోనా మహమ్మారిని జంట భవనాల దాడులు, పెరల్ హార్బర్ ఎటాక్‌తో ఆయన పోల్చారు.

ఈ రెండు ఘటనలప్పుడు అమెరికా క్షోభపడింది. తట్టుకోలేకపోయింది. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈసారి అలాంటి దారుణాన్ని అమెరికా ఎదుర్కోబోతోందన్నది ఆయన ఉద్దేశం. అమెరికాలో ఆదివారం నాటికే మరణాల సంఖ్య 9,500 చేరింది. నిజానికి, సెప్టెంబర్ దాడుల్లో చనిపోయినవాళ్లకన్నా ఈ సంఖ్య మూడింతలు ఎక్కువ.

9/11 దాడుల్లో 2,977 మంది చనిపోయారు. అదే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పెరల్ హార్బర్ దాడుల్లో 2,400 మంది చనిపోయారు. ఈ రెండు ఘటనలు అమెరికా చరిత్రను మార్చేశాయి. అదే కరోనా వైరల్ దాడిలో 3.3 లక్షలమంది చిక్కుకున్నారు. ఒక్క న్యూయార్క్ లోనే 4,000 మందికి పైగా చనిపోయారు.  అమెరికాలో కనీవినీ ఎరుగని విపత్తు ఇది.

covid-19 మీద  White House Task Force వేసిన అంచనా ప్రకారం, రానున్నవారాల్లో లక్ష నుంచి 2లక్షలమంది వరకు చనిపోవచ్చు. అంటే మారణ హోమమే అనుకోవాలి. వచ్చే ఆరేడు రోజుల్లో న్యూయర్క్ లో కరోనా తన విశ్వరూపాన్ని చూపించబోతోంది. అందుకే, ఎక్కడివారు అక్కడే ఉండాలి. సామాజిక దూరాన్ని పాటించాలని వైట్ హౌస్ కోరింది. మొత్తం 33 కోట్ల జనాభాలో 95శాతం ఇళ్లలోనే ఉన్నారు.

national emergencyని ప్రకటిస్తారని అనుకున్నా, ట్రంప్ మాత్రం 50 రాష్ట్రాల్లోని 42 చోట్ల అతిపెద్ద విపత్తును మాత్రమే ప్రకటించారు. ఈవారం వీలైనంత తక్కువ మరణాలతో గట్టెక్కేందుకు అమెరికా ప్రార్ధనలు చేస్తోంది. అమెరికా సైన్యం 50వేల మంది సైనికులను బరిలో దింపింది.

1000 మంది మిలటరీ డాక్టర్లు విధుల్లో ఉన్నారు. ఇప్పటికే తాత్కాలికంగా 30 హాస్పటల్స్‌ను నిర్మించారు. నావీ ఐతే, తన షిప్‌లను కోవిడ్ బాధితుల కోసం హాస్పటల్స్ గా మార్చేసింది.