ఒక్క డోసుకే కరోనా ఖేల్ ఖతం.. ఆఖరి దశలో కోవిడ్-19 వ్యాక్సిన్

  • Published By: vamsi ,Published On : September 24, 2020 / 08:24 AM IST
ఒక్క డోసుకే కరోనా ఖేల్ ఖతం.. ఆఖరి దశలో కోవిడ్-19 వ్యాక్సిన్

జాన్సన్ & జాన్సన్ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ చివరి దశ ప్రారంభం అయ్యింది. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు ఇస్తే చాలు కరోనా నివారణ అవుతుందని చెబుతున్నారు. అభివృద్ధి చేయబడుతున్న, చేసిన చాలా టీకాలకు రెండు డోసులు వెయ్యాల్సిన అవసరం ఉంది.

అయితే 60వేల మంది వాలంటీర్లపై టీకాను పరీక్షించాలని కంపెనీ యోచిస్తోంది, ఇది ఇప్పటివరకు అత్యధిక సంఖ్య. ఈ అధ్యయనం అమెరికాలోనే కాకుండా దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో మరియు పెరూలలో జరుగుతుంది.



కంపెనీ టీకా ఇతర సంస్థల కంటే వెనుకబడినా, ప్రయోజనాలు మాత్రం మెరుగ్గా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇందులో అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే దీనిని సబ్ జీరో ఉష్ణోగ్రతలో నిల్వ చేయవలసిన అవసరం లేదు.



ఒకే ఒక్క డోసుతో కొవిడ్‌-19 నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యం ఉన్న ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. టీకా ఎంత సురక్షితంగా మరియు ప్రభావవంతంగా ఉందో ఈ సంవత్సరం చివరినాటికి నిర్ధారించవచ్చని కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ పాల్ స్టాఫ్ఫెల్ చెప్పారు.