కరోనా వ్యాక్సిన్లు ఎంతవరకు సురక్షితం? సమర్థవంతంగా పనిచేస్తాయా? తెలుసుకునేదెలా?

  • Published By: sreehari ,Published On : November 13, 2020 / 04:27 PM IST
కరోనా వ్యాక్సిన్లు ఎంతవరకు సురక్షితం? సమర్థవంతంగా పనిచేస్తాయా? తెలుసుకునేదెలా?

COVID-19 vaccines : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనావైరస్‌ను  అంతం చేసేందుకు వందలాది కరోనా వ్యాక్సిన్లు మిలియన్ల డోస్‌లతో సిద్ధం అవుతున్నాయి.

ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రేసులో పలు ఫార్మా కంపెనీలు పోటీపడి ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఫైజర్, బయోంటెక్ కంపెనీలు సైతం తమ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ట్రయల్స్ ఫలితాలను విడుదల చేశాయి.



అయితే వ్యాక్సిన్ ట్రయల్ ఫలితాల్లో ఎంతవరకు సురక్షితం అనేదానిపై కచ్చితమైన హామీనివ్వలేని పరిస్థితి. కరోనా వ్యాక్సిన్ల సురక్షితంపై డ్రగ్ మేకర్లకు గణంకాలు ఎలా ఉపయోగపడతాయనేది ఆధారపడి ఉంటుందని అంటున్నారు.



వ్యాక్సిన్ సమర్థత ఎంతంటే? :
వ్యాక్సిన్ సమర్థతను గుర్తించడం అంత సులభం కాదు. ముందుగా ఎవరికైనా ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాతే అదేలా పనిచేస్తుందో తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో పాల్గొనే కరోనా ట్రయల్స్‌లో సగానికి పైగా వ్యాక్సిన్, మిగిలిన సగానికి ప్లేసిబోను ఇస్తారు.

వాలంటీర్లలో వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఎక్కువ శాతం మంది అనారోగ్యానికి గురవుతారు. వీరిలో కనీసం కొంతమందిలోనైనా వ్యాక్సిన్ రక్షణ ఇస్తుంది.



కొన్ని కేసుల్లో.. HIV లేదా Ebola వంటి వైరస్‌లకు Placebo తీసుకున్నవారిలో అధికంగా మరణాల రేటు ఉంది. అదే కరోనా వైరస్ విషయంలో మాత్రం సహజ ఇన్ఫెక్షన్ పైనే రీసెర్చర్లు ఆధారాపడాల్సి ఉంటుంది.

ఎందుకంటే దీనిపై అధ్యయనమే లేదు. ఉద్దేశపూర్వకంగానే కరోనా వైరస్ వాలంటీర్లలోకి ఎక్కిస్తున్నారు.

దీని ఆధారంగా కరోనా వైరస్ పై వ్యాక్సిన్ ఎంతవరకు సమర్థవంతగా నివారించగలదో పరీక్షించే అవకాశం ఉంది.

ఫైజర్, బయెంటెక్ ట్రయల్‌లో దాదాపు 44,000 మంది వాలంటీర్లు పాల్గొంటే.. వారిలో 21,999 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.

వ్యాక్సిన్ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేయగలదో గణాంకాల ఆధారంగా రీసెర్చర్లు భావిస్తున్నారు.



వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం :
కరోనా వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితమనేది అందరికి వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడే కచ్చితంగా అంచనావేయగలమని అంటున్నారు రీసెర్చర్లు. మెడికల్ కమ్యూనిటీ, ప్రజలు కూడా వ్యాక్సిన్ సురక్షితమైనదేనని విశ్వసించాలి.

ఫైజర్ వ్యాక్సిన్ 21,999 మందికి వేయగా.. వారిలో కొందరిలో మాత్రమే ఒకేరకమైన సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్ దుష్ప్రభవాలు కనిపించాయి. కానీ, ఇప్పటివరకూ హానికర దుష్ర్పభవాలు నమోదు కాలేదు.



గణాంకాల్లో మూడో నిబంధన ప్రకారం పరిశీలిస్తే.. ట్రయల్స్ లో పాల్గొన్న 21,999 వాలంటీర్లలో ఎలాంటి దుష్ప్రభవాలు లేవు.

కానీ, 95 శాతం విశ్వాసాన్ని నింపింది. మొత్తం పాల్గొన్నవారిని విభిజిస్తే.. మూడింతల కంటే తక్కువ మందిలోనే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి.

అది కూడా పదివేల కంటే తక్కువమందిలోనే కనిపించాయి. అందుకే వ్యాక్సిన్ సురక్షితంపై ట్రయల్స్ మరింత పొడిగించాలని పరిశోధకులు భావిస్తున్నారు.



సురక్షితమైన వ్యాక్సిన్ ఎలా వాడాలి? :
జాతీయవ్యాప్తంగా కార్యక్రమాల్లో భాగంగా వ్యాక్సినేషన్ అమలు చేసేందుకు వైద్యాధికారులు కొత్త మార్గాలను విశ్లేషిస్తున్నారు. ఇది ఎలా అమలు చేయాలి అనేది మాత్రం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే యూకే ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ 40 మిలియన్ల డోస్‌లను ఆర్డర్ చేసింది.



ప్రతిఒక్కరికి రెండు డోస్ ల చొప్పున అందుతుంది. 20 మిలియన్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ అవసరం పడుతుంది. అందులోనూ 55ఏళ్లు ఆపై వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

వ్యాక్సిన్ ఉత్పత్తి, డెలివరీకి మరికొంత సమయం పట్టనుంది. అందుకే వ్యాక్సిన్ పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.