కొవిడ్-19 వ్యాక్సిన్ బలవంతంగా ఇవ్వడానికి వీల్లేదు: WHO

కొవిడ్-19 వ్యాక్సిన్ బలవంతంగా ఇవ్వడానికి వీల్లేదు: WHO

WHO: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మాసూటికల్ మేజర్స్ కొవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ కోసం పోటీపడుతున్నాయి. ఈ మేరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ ప్రకటన చేసింది. యూఎన్ హెల్త్ ఏజెన్సీ ప్రపోజ్ చేసిన దాన్ని బట్టి వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాదు. కానీ, తప్పక వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారికి మాత్రం వేయాల్సిందే.

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ప్రతి ఒక్క దేశం కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రచారాల్లో ఇలా ప్రవర్తించాలి.



‘వ్యాక్సిన్ వేయించుకోవడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అనేది ఉండదు. ప్రత్యేకించి వ్యాక్సిన్ల విషయంలో కాస్త మినహాయింపు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ ఇమ్యూనైజేషన్ డిపార్ట్‌మెంట్ డైరక్టర్ కేట్ ఓ బ్రీన్ అంటున్నారు. వ్యాక్సిన్‌ను ఎంకరేజ్ చేయడంతో పాటు మన అవసరాలు కూడా తీరుస్తుంది. ఇదే క్రమంలో వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తాయే తప్ప అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కంపల్సరీ అని చెప్తాయనుకోవడం లేదు’ అని ఆయన అన్నారు.

కానీ, కొన్ని ప్రొఫెషన్స్ మాత్రం వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాల్సిందే. హెల్త్ కేర్ వర్కర్లతో పాటు శ్వాస సంబంధిత టెక్నిషియన్లు, ఇంటెన్సివ్ కేర్ మెడిక్స్ వంటి వారు తప్పకుండా వ్యాక్సిన్ నుంచి మినహాయింపు లేదు. ‘మనం ప్రజలను కన్విన్స్ చేయాల్సి ఉంది. దాంతోనే బయటపడగలం’ అని ర్యాన్ అన్నారు.

‘చాలా మందికి వ్యాక్సిన్ తయారుచేయాలని ప్లాన్ చేస్తున్నాం. వీలైనంత ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనేదే ప్లాన్. వ్యాక్సిన్ వేయించుకోవడాన్ని రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలని అనుకుంటున్నా’ అని ర్యాన్ ముగించారు.