గుడ్‌న్యూస్: కరోనా బలహీనపడుతోంది.. వ్యాక్సిన్ లేకుండానే వైరస్ చచ్చిపోవచ్చు : సైంటిస్టుల మాటల్లోనే..!

  • Published By: srihari ,Published On : June 22, 2020 / 10:27 AM IST
గుడ్‌న్యూస్: కరోనా బలహీనపడుతోంది.. వ్యాక్సిన్ లేకుండానే వైరస్ చచ్చిపోవచ్చు : సైంటిస్టుల మాటల్లోనే..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కాలక్రమేణా బలహీనపడుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాక్సిన్ అవసరం లేకుండానే కరోనా అంతమై పోవచ్చునని ప్రముఖ ఇటాలియన్ అంటు వ్యాధులు స్పెషలిస్ట్ ఒకరు వెల్లడించారు. మిలియన్ల మందికి కరోనా సోకగా.. వందల వేల మంది మరణించారు. కరోనాను ఎదుర్కొనే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా నలమూలల నుంచి పరిశోధకులు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. 

కానీ, ఇటలీలోని Policlinico San Martino ఆస్పత్రిలో అంటు వ్యాధుల క్లినిక్ హెడ్ ప్రొఫెసర్ Matteo Bassetti ప్రకారం.. కరోనా నివారణకు ఇక వ్యాక్సిన్ అవసరం లేకపోవచ్చునని అన్నారు. ఇటీవల నెలల వ్యవధిలో వైరస్ క్రమంగా బలహీనపడిందని బస్సెట్టి ది టెలిగ్రాఫ్‌కు తెలిపారు. వైరస్ తీవ్రతతో మారుతోందని ఆయన అన్నారు. మార్చి, ఏప్రిల్ ప్రారంభంలో, శాంపిల్స్ పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెప్పారు.

ప్రజలు అనారోగ్యంతో చాలా కష్టంతో అత్యవసర విభాగానికి వస్తున్నారని తెలిపారు. వారికి ఆక్సిజన్, వెంటిలేషన్ అవసరమని, న్యుమోనియాను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పుడు, గత నాలుగు వారాల్లో, శాంపిల్స్ పరంగా పూర్తిగా మారిపోయింది. శ్వాసకోశంలో తక్కువ వైరల్ లోడ్ ఉండవచ్చునని తెలిపారు. వైరస్‌లు జన్యు పరివర్తన కారణంగా ఇంకా శాస్త్రీయంగా నిరూపితం కాలేదన్నారు. 

మార్చి, ఏప్రిల్ నెలల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. 80 లేదా 90 ఏళ్ల వయస్సు గల వృద్ధ రోగులు ఎవరి సాయం లేకుండా ఊపిరి పీల్చుకుంటున్నారు. అదే రోగులు చనిపోయేవారు రెండు లేదా మూడు రోజుల ముందుగానే చనిపోయేవారు ఉన్నారు. లాక్‌డౌన్, మాస్క్ ధరించడం, సామాజిక దూరం కారణంగా మనకు ఇప్పుడు తక్కువ వైరల్ లోడ్ ఉందని తెలిపారు. ఇప్పుడు ఎందుకు భిన్నంగా మారిందో ఇంకా రుజువు కావాల్సి ఉంది. 

కొన్ని రోజుల్లో కరోనా వైరస్ ఎలాంటి టీకా లేకుండా పూర్తిగా అంతమైపోతుందని అన్నారు. వైరస్ బలహీనపడుతుందని ఆరోగ్య నిపుణులు ఊహించడం ఇదేం మొదటిసారి కాదు. మేలో, UKలోని రూథర్‌ఫోర్డ్ హెల్త్‌లో ఆంకాలజిస్ట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ కరోల్ సికోరా కూడా మహమ్మారి దానంతంటే అదే అంతమైపోవచ్చునని తెలిపారు. మనకు విజయవంతమైన వ్యాక్సిన్ ఉంటే.. మశూచి సాధించినట్టే చేయవచ్చు. కానీ కరోనా అంటువ్యాధి, విస్తృతంగా వ్యాపించడంతో ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. 

Read: కరోనా నుంచి కోలుకున్న వారిలో ఈ ముప్పు తప్పదు!