కరోనానేర్పిన గుణపాఠం : ఫుడ్ వేస్టేజ్ తగ్గుతోంది…హెల్తీఫుడ్ తినడం పెరుగుతోంది

  • Published By: nagamani ,Published On : June 2, 2020 / 07:03 AM IST
కరోనానేర్పిన గుణపాఠం : ఫుడ్ వేస్టేజ్ తగ్గుతోంది…హెల్తీఫుడ్ తినడం పెరుగుతోంది

కరోనా వైరస్ తో వచ్చిన లాక్ డౌన్ తో మనిషి ఎప్పుడూ ఊహించని మార్పులు వచ్చాయి. ఆహారం విషయంలో కచ్చితంగా మనిషి మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆహారం అత్యంత పొదుపుగా వాడుకుంటున్నారని..జంక్ ఫుడ్ కు బదులుగా కూరగాయలు..పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటానికే ఆసక్తి చూపుతున్నారని ఆ బెల్జియంలోని ఆంట్వెర్ప్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.

  
కరోనా వైరస్. మనిషి జీవనశైలిలో పెను మార్పులు తీసుకువచ్చింది. ఇంటికే పరిమితం చేసింది. ఆర్థికంగా నష్టాలను తెచ్చిపెట్టింది. పలు వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. పరిశ్రమలు నిలిచిపోయాయి. వ్యాపారాలు మూతపడ్డాయి. ఉత్పత్తి నిలిచిపోయింది. బడుగుజీవులకు పనులు లేకుండాపోయింది. ఉపాధి పూర్తిగా దెబ్బతింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎన్నో..కారణం కరోనా వైరస్..తద్వారా వచ్చిన లాక్ డౌన్ ఎఫెక్ట్. 

ఈక్రమంలో మార్పు మంచికే అన్నట్లుగా మనిషి ఏది వచ్చినా ముందుకు సాగిపోవాలి. కానీ కరోనా వల్ల నా ఇబ్బందులు పడుతున్నామనుకునేవారు ఒకటి గమనించాలి. కరోనా మనిషిలో చాలా చాలా మార్పులు తెచ్చింది. ఎలా బతకాలో..ఎలా ఉండకూడదో నేర్పించింది. అన్నింటికంటే ముఖ్యంగా ఆహారం విషయంలో పెను మార్పులు తెచ్చింది. ఇంతకు మందు ఆహారం చాలా చాలా వృథా అయ్యేది. ఇష్టమొచ్చినట్లుగా వృథా అయ్యేది. ముఖ్యంగా పెళ్లిళ్లు వంటి పలు ఫంక్షన్ల ద్వారా ఆహారం వృధా అంతా ఇంతా కాదు. అలా వృథా అయ్యే ఆహారంతో చాలామంది కడుపు నింపుకోవచ్చు. కానీ లెక్కకు మించిన రకరకాల ఐటెమ్స్ తో తినే ప్లేటు కూడా పట్టలేనంత మెనులతో ఫంక్షన్లలో ఆహారం ఉండేది.
 

కానీ ఇప్పుడలా కాదు..కరోనా వల్ల ఉన్న ఉద్యోగాలకు ముప్పు ఎప్పుడొస్తుందో తెలీదు. ఉపాధి లేక ఏం కష్టాలు పడాలో అనే ఆందోళన..ఉన్న డబ్బుల్ని ఎలా జాగ్రత్తగా ఖర్చు చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని మనిషికి అర్థమైంది. అందుకే పొదుపు మంత్రం జపిస్తున్నాడు. నాలుగు రకాల కూరలు వండి తినేవాళ్లు ఒక్కకూరతోనే సరిపెట్టుకుంటున్నారు. ఆ తినేది కూడా ఏదో తిన్నామనిపించకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యంగా లేకపోతే కరోనా దాడి తప్పదు.ప్రతీ మనిషి ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిందే. కరోనా వల్ల ఆహారం వృథా చాలా శాతం తగ్గిపోయింది.జంక్ ఫుడ్ కు బదులుగా కూరగాయలు..పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటానికే ఆసక్తి చూపుతున్నారని ఆ బెల్జియంలోని ఆంట్వెర్ప్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.

ఆస్ట్రేలియా, బెల్జియం, చిలీ, ఉగాండా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, గ్రీస్, కెనడా, బ్రెజిల్, ఐర్లాండ్11 దేశాలలో బెల్జియంలోని ఆంట్వెర్ప్ వర్శిటీ నిర్వహించిన సర్వేలో తేలింది. అక్కడ జంక్ ఫుడ్..మైక్రోవేవ్ రెడీ ఫుడ్ బదులు  పండ్లు, కూరగాయలు ఎక్కువగా కొనే దిశగా ప్రజల అలవాట్లు మారాయిన వెల్లడించింది.

ఈ సందర్భంగా..సర్వే సభ్యుల్లో ఒకరైన షార్లెట్ డి బ్యాకర్ మాట్లాడుతూ..లాక్ డౌన్ వల్ల ప్రజలు..రెస్టారెంట్లకు వెళ్లటంమానేసారు..ఆన్ లైన్ ఫుడ్ డెలీవరీలు లేవు..దీంతో ఇంట్లోనే వండుకుని తింటున్నారనీ..పండ్లు కూరగాయలు ఎక్కువగా తింటున్నారనీ..అలాగే స్నాక్స్ కూడా తగ్గించివేసారని తెలిపారు. దీంతో తాము చక్కగా బరువు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉన్నామని పలువురు తెలిపారని అన్నారు. 
రు..

పని ఒత్తిడి..వండుకు తినే సమయం లేక ఆరోగ్యకరమైన ఆహార అందుబాటులో లేక ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేసుకుని జంక్ ఫుడ్ లు తినేస్తూ..అనారోగ్యాన్ని కొని తెచ్చుకునేవారు. దీంతో ఇల్లు గుల్ల..ఒళ్లు గుల్ల. ఇప్పుడా పరిస్థితి లేదు.

ఈ లాక్ డౌన్ తో చిలీలో స్నాక్స్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయని తేలింది.నాన్ వెజ్ ఫుడ్..మద్యం సేవించటం కూడా తగ్గింది. తీరిక దొరకటంతో ఇంట్లోనే కొత్తకొత్త వంటకాలు తయారు చేసుకుంటూ తింటున్నారు. తినగా మిగిలిన ఆహారాన్ని గతంలోలాగ పారవేయకుండా..దాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. దీంతో ఆహారం పూర్తిగా భారీగా తగ్గింది. పని ఒత్తిడి తగ్గింది. దీంతో పాటు అన్నీ తగ్గాయి. మార్పులు చోటుచేసుకున్నాయని దీంతో ప్రజలు ఆందోళన లేని ఆరోగ్యంతో ఉన్నారని సర్వేలో వెల్లడించింది.

Read: నేపాల్ మ్యాప్ లో భారత భూభాగం..నేపాల్ పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లు