COVID antibodies: ఆ ఏజ్ గ్రూప్ వారికి ఏడు రెట్లు ఎక్కువగా యాంటీబాడీలు

జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. యువకుల కంటే వృద్ధుల్లోనే ఎక్కువ యాంటీబాడీలు ప్రొడ్యూస్ అవుతాయట.

COVID antibodies: ఆ ఏజ్ గ్రూప్ వారికి ఏడు రెట్లు ఎక్కువగా యాంటీబాడీలు

Vaccination (1)

COVID antibodies: కరోనావైరస్ వేరియంట్లపై ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. ప్రాణాంతక వైరస్ నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సినేషన్ రెండు డోసులు వేయించుకున్నా రక్షణ ఉంటుందనే నమ్మకమే లేదు. డెల్టా, లామ్డా, కప్పా వేరియంట్లు కొవిడ్ నుంచి పూర్తి స్థాయి ప్రొటెక్షన్ కల్పించకపోయినా.. అవి వేరియంట్లపై ఎఫెక్టివ్ పనిచేస్తూ.. వైరస్ నుంచి పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది.

కొన్ని మిగిలిన వేరియంట్లపై పోరాడలేవు. అసలు వ్యాక్సిన్లు వేరియంట్లపై పనిచేసే తీరు ఏజ్ గ్రూప్ మీద ఆధారపడి ఉంటుంది. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. యువకుల కంటే వృద్ధుల్లోనే ఎక్కువ యాంటీబాడీలు ప్రొడ్యూస్ అవుతాయట. ఒరిగన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ ఫైజర్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేయించుకున్న 50మంది అభ్యర్థులను రెండు వారాల తర్వాత పరీక్షించింది. రక్తంలోని సీరంను పరీక్షించి యాంటీబాడీల ఉత్పత్తిని గమనించారు.

ఈ స్టడీలో 20ల్లో ఉండేవారిలో యాంటీబాడీల ఉత్పత్తి 70ల్లో ఉండేవారి యాంటీబాడీల ఉత్పత్తి కంటే ఏడు రెట్లు తక్కువగా ఉందని తెలిసింది. అయినప్పటికీ అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అంటున్నారు స్టడీ నిర్వాహకులు. వైరస్ నుంచి రిస్క్ లేకుండా సేఫ్ గా ఉండటానికి చాలా ముఖ్యం. వ్యాక్సినేషన్ అనేది చిన్నవాళ్ల కంటే పెద్ద వాళ్లకు ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వడం ఖాయం.