China’s Vaccine fail: విఫలమైన చైనా వ్యాక్సిన్.. కరోనా కేసులు తగ్గట్లేదు

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌కు చైనా కరోనా వ్యాక్సిన్‌ను చిన్న మధ్యతరహా దేశాలు కొనుగోలు చేశాయి. అయితే, ఆయా దేశాల్లో వ్యాక్సిన్ విఫలం అయినట్లుగా తెలుస్తోంది.

China’s Vaccine fail: విఫలమైన చైనా వ్యాక్సిన్.. కరోనా కేసులు తగ్గట్లేదు

China’s Vaccine Fail

China’s COVID vaccine: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌పై యుద్ధానికి చైనా కరోనా వ్యాక్సిన్‌ను చిన్న మధ్యతరహా దేశాలు కొనుగోలు చేశాయి. అయితే, ఆయా దేశాల్లో వ్యాక్సిన్ విఫలం అయినట్లుగా తెలుస్తోంది. చైనా COVID వ్యాక్సిన్లతో తమ ప్రజలకు టీకాలు వేసినా కూడా కేసులు తగ్గట్లేదని, చైనా వ్యాక్సిన్ వేసుకున్న చాలా దేశాలు చెబుతున్నాయి. వినాశకరమైన కొత్త కేసులను ఎదుర్కొంటున్నట్లుగా దేశాలు ప్రకటిస్తున్నాయి.

దీంతో దాదాపుగా అన్నీ దేశాలు చైనాతో వ్యాక్సిన్ సంబంధాలను కట్ చేసుకుని, పశ్చిమ దేశాల వ్యాక్సిన్‌ల వైపు చూస్తున్నాయి. ఈ ప్రకటన చైనా వ్యాక్సిన్ దౌత్యాన్ని బలహీనం చేస్తుందని, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు అమెరికా వంటి పశ్చాత్య దేశాలతో వ్యాక్సిన్ విషయంలో వాణిజ్య ఒప్పందాలను చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. బీజింగ్ వైపు చూడట్లేదు.

“సీషెల్స్, చిలీ, బహ్రెయిన్ మరియు మంగోలియా వంటి దేశాల్లో 50 నుండి 68 శాతం జనాభా పూర్తిగా టీకాలు వేసుకున్నారు. అయినా కూడా ఈ దేశాల్లో ఇప్పటికీ కోవిడ్ కేసులు విపరీతంగా వస్తున్నాయి. టాప్ 10దేశాల్లో ఈ దేశాలు ఉంటున్నాయి. ఈ నాలుగు దేశాలు కూడా ఎక్కువగా చైనా వ్యాక్సిన్లను వేశాయి.

చైనా కంపెనీలు సినోఫార్మ్ మరియు సినోవాక్ బయోటెక్ చేసిన షాట్లను ఈ దేశాల్లో ఉపయోగిస్తున్నారు. చైనా వివిధ దేశాలకు పదిలక్షల వ్యాక్సిన్ మోతాదులను అందిస్తోంది. అయితే ఈ దేశాలు చైనా వ్యాక్సిన్లను నిరాకరిస్తే, అమెరికా ముందుండే అవకాశం ఉంది.