Covid Is AirBorne: గాలి ద్వారానూ కరోనా వైరస్.. శాస్త్రవేత్తలకు సపోర్ట్‌గా వైధ్యాధికారులు

కొవిడ్ మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపి చెందుతోందని గతేడాది కాలంగా నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తోన్న విషయాలను వైద్యాధికారులు అంగీకరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ గాలి ద్వారా కొవిడ్‌ వ్యాప్తి జరగొచ్చని చెప్తున్నాయి.

Covid Is AirBorne: గాలి ద్వారానూ కరోనా వైరస్.. శాస్త్రవేత్తలకు సపోర్ట్‌గా వైధ్యాధికారులు

Covid Is Airborne

Covid Is AirBorne: కొవిడ్ మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపి చెందుతోందని గతేడాది కాలంగా నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తోన్న విషయాలను వైద్యాధికారులు అంగీకరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ గాలి ద్వారా కొవిడ్‌ వ్యాప్తి జరగొచ్చని చెప్తున్నాయి.

ఒకవేళ అదే నిజమైతే గాల్లో వైరస్‌ను నియంత్రించడం ఎలా..? తీవ్రతను తగ్గించేదెలా? వెంటిలేషన్‌ ఒకటే మార్గమని చెబుతున్నారు సైంటిస్టులు. 1800వ సంవత్సరంలో పైపుల నుంచి కలరా వ్యాపించిందని గుర్తించినప్పుడు నీటి సరఫరాను సరిచేసిన విధంగా.. వెంటిలేషన్‌ సిస్టమ్‌లో మార్పులు తీసుకురావాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.

ఇంటి లోపల గాలి స్వచ్ఛంగా ఉండటం వల్ల కరోనా మాత్రమే కాకుండా.. ఫ్లూ, ఇతర శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించొచ్చని చెబుతున్నారు.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ లిదియా మోరావ్‌స్కా కెప్టెన్సీలో 14 దేశాలకు చెందిన 39 మంది సైంటిస్టులు కరోనాపై సుదీర్ఘ అధ్యయనం చేసి తమ పరిశోధనలను వెల్లడించారు. వెంటిలేషన్‌ వ్యవస్థను మెరుగుపరచడం వల్ల అంటువ్యాధుల వ్యాప్తిని నివారించొచ్చని అభిప్రాయపడ్డారు.

ఏరోసోల్స్‌తో ప్రమాదమే..
దగ్గడం, తుమ్మడం, శ్వాస తీసుకోవడం, మాట్లాడటం, పాటలు పాడటం వంటివి చేసినప్పుడు కరోనా సోకిన వ్యక్తి ముక్కు, గొంతు నుంచి వైరస్‌ కణాలు బయటకు విడుదలవుతాయి. అందులో కంటికి కన్పించని చిన్న చిన్న ఏరోసోల్స్‌ కణాలు మాత్రం గాల్లో ఉండిపోతాయి. తేమ, ఉష్ణోగ్రత, గాలి వేగాన్ని బట్టి ప్రయాణిస్తుంటాయి. గాల్లో ఎక్కువ గంటల పాటు ఉండిపోవడంతో పాటు గదుల్లో తొందరగా వ్యాపిస్తుంటాయి.

భవనాల్లో వెంటిలేషన్‌ పెంచడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించొచ్చని అంటున్నారు. కరోనా వ్యాప్తి, దాన్ని అరికట్టడంపై డబ్ల్యూహెచ్‌వో ఇప్పటివరకు 2సార్లు గైడ్ లైన్స్‌ను సవరించింది. ఎప్పుడూ మూసి ఉండే గదుల్లో ఏరోసోల్స్‌ ఎక్కువ కాలం గాల్లో ఉంటున్నాయని, అందువల్ల ఇండోర్‌లో పనిచేసే వారిలో ఎక్కువ మంది వైరస్‌ బారిన పడుతున్నారని తెలిపారు.