Covid Isolation : విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండక్కర్లేదు!

భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి.

Covid Isolation : విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండక్కర్లేదు!

Covid Isolation Isolation Not Mandatory For Flyers From At Risk Countries From Jan 22 Centre

Covid Isolation : భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే దిశగా కేంద్ర రాష్ట్ర్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపడుతున్నాయి. కరోనా కట్టడికి కఠిన ఆంక్షలను విధిస్తూనే మరోవైపు ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్​ నిబంధనలకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విదేశీ టూరిస్టుల ఐసోలేషన్ నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 22న అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం.. ఎయిర్​పోర్ట్​లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్​​ వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండటం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కరోనా రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సాధారణ కొవిడ్​ ప్రోటోకాల్​ అనుసరిస్తే సరిపోతుందని వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ మార్గదర్శకాలనే అమలు చేయాలని అధికారులకు సూచనలు చేసింది.

విదేశీ ప్రయాణికుల కోసం సవరించిన మార్గదర్శకాలు మినహా మిగతా నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా ముప్పు అధికంగా ఉండే దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కూడా కొత్త నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో కేంద్రం తెలిపింది. ఎయిర్ పోర్టుల వద్ద స్క్రీనింగ్ సమయంలో వైరస్​ లక్షణాలు ఉంటే.. ప్రయాణికులు వెంటనే ఐసోలేషన్​కు వెళ్లాలని కొవిడ్​ ప్రొటోకాల్​ సూచిస్తోంది. ప్రైమరీ కాంటాక్ట్​లను కూడా గుర్తించి కరోనా టెస్టులను నిర్వహించాలని చెబుతోంది. భారత్​కు వచ్చిన విదేశీయులు కరోనా పాజిటివ్​ నిర్ధారణ తర్వాత ఏడు రోజులు హోం క్వారెంటైన్​లో ఉండాల్సి ఉంటుంది. 8వ రోజు నెగటివ్​ వచ్చిన తరువాత కూడా మరో 7 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉండాల్సి ఉంటుంది.

Read Also : India Covid Cases : భారత్‌లో కొత్తగా 3,37,704 పాజిటివ్ కేసులు, 488 మరణాలు