కరోనా ‘న్యూ వేరియంట్’ విజృంభణ.. Tier-3లోకి లండన్‌.. కఠిన ఆంక్షలు!

కరోనా ‘న్యూ వేరియంట్’ విజృంభణ.. Tier-3లోకి లండన్‌.. కఠిన ఆంక్షలు!

New Variant of Covid-19 Infections- London to move tier 3 Restrictions: లండన్ లో మళ్లీ ‘న్యూ వేరియంట్’ కరోనా విజృంభిస్తోంది. ఇంగ్లండ్ దక్షిణ ప్రాంతాల్లో కొత్త వేరియంట్ (New Variant Corona Virus) కరోనా కేసులు 1,000 కి పైగా నమోదయ్యాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య తీవ్రమవుతోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో లండన్‌లో కఠిన ఆంక్షలను అమలు చేయబోతోంది. లండన్‌లో కొత్త వేరియంట్ కరోనా కేసులను గుర్తించినట్టు ఆరోగ్య శాఖ మంత్రి Matt Hancock ఒక ప్రకటనలో ‌ వెల్లడించారు.  లండన్‌లో టైర్-‌ 3  కఠిన ఆంక్షలను విధించే విషయమై ప్రతినిధుల సభలో ఆయన ప్రకటన చేయనున్నారు.

కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు లండన్‌లో కఠినమైన ‘Tier-3’ కఠినమైన ఆంక్షలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై లండన్‌ ఎంపీలకు అధికారులు సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేశ రాజధాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నిర్ణయాలు వద్దని లండన్‌ మేయర్‌ సాదిఖ్‌ ఖాన్‌ మంత్రులకు కోరారు.

‘టయర్‌ 3’లో అమల్లోకి వస్తే.. 34 మిలియన్ల మంది కఠినమైన నియమాలను ఎదుర్కొంటారు. అంతేకాదు.. ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అన్ని బహిరంగ కార్యక్రమాలపై నిషేధిస్తారు.

బార్లు, పబ్‌లు, కెఫేలు, రెస్టారెంట్లను మూసివేస్తారు. ‘టేక్‌ అవే’కు మాత్రం అవకాశం కల్పించవచ్చు. ఇక  సినిమా థియేటర్లను మూసివేస్తారు. టయర్‌ 3 ఆంక్షలున్న ప్రాంతం నుంచి అక్కడివారు ఎవరూ వేరే ప్రాంతాలకు ప్రయాణించడానికి అనుమతి ఉండదు. కొన్ని ప్రాంతాలలో కేసులు క్రిస్మస్ నాటికి చాలా వేగంగా పెరుగుతాయని ప్రొఫెసర్ విట్టి హెచ్చరించారు.

దక్షిణ ఇంగ్లాండ్‌లో వేగంగా కరోనా వ్యాప్తి చెందుతోందని హాన్కాక్ తెలిపారు. టేకావే డెలివరీ మినహా టైర్- 3 లో పబ్బులు రెస్టారెంట్లు మూసివేయాలన్నారు. నిబంధనల ప్రకారం.. క్రీడా అభిమానులను స్టేడియాలలోకి అనుమతించరు. ఇండోర్ ఎంటర్ టైన్మెంట్ ప్లాట్ ఫాంలు, థియేటర్లు,  సినిమాలు మూసేస్తారు.
Covid-19 Restrictions: London to move into tier 3 as infections riseటైర్ టూలో 21.5 మిలియన్లు మంది ఆంక్షలు ఎదుర్కొగా..  టైర్ వన్ లో 7లక్షల మంది ఆంక్షలను ఎదుర్కొన్నారు. యూకేలో మరో 20,263 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 232 మంది మరణించారని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.

Tier-3 ఆంక్షలు ఇవే? :
– మీ ఇంట్లో తప్ప, ప్రైవేట్ తోటలలో లేదా బహిరంగ ప్రదేశాలలో కలిసేందుకు వీలుండదు.
– గార్డెన్‌లు, బీచ్‌లు లేదా గ్రామీణ ప్రాంతాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో 6 వరకు అందరిని కలుసుకోవచ్చు.
– షాపులు, జిమ్‌లు వ్యక్తిగత సంరక్షణ సేవలు (సెలూన్ వంటివి) తెరిచే ఉంటాయి.
– బార్లు, పబ్బులు, కేఫ్‌లు రెస్టారెంట్లు డెలివరీ టేకావే మినహా అన్ని మూసేస్తారు.
– క్రీడా అభిమానులు స్టేడియంలో జరిగే క్రీడా కార్యక్రమాలకు హాజరు కాలేరు.
– ఇండోర్ ఎంటర్ టైన్మెంట్ – థియేటర్లు, బౌలింగ్ ప్రాంతాలు సినిమాలు మూసేస్తారు.