Corona Virus: గాలిలో 20 నిమిషాలలోపే కరోనా సోకే సామర్థ్యం కోల్పోతుంది

కరోనావైరస్ గాలిలో 20 నిమిషాలు ఉంటే, సోకే సామర్థ్యాన్ని 90శాతం కోల్పోతుందని ఓ పరిశోధన వెల్లడించింది.

Corona Virus: గాలిలో 20 నిమిషాలలోపే కరోనా సోకే సామర్థ్యం కోల్పోతుంది

short-range Covid transmission

Corona Virus: కరోనావైరస్ గాలిలో 20 నిమిషాలు ఉంటే, సోకే సామర్థ్యాన్ని 90శాతం కోల్పోతుందని ఓ పరిశోధన వెల్లడించింది. మొదటి ఐదు నిమిషాల్లో మాత్రం సోకే అవకాశం తీవ్రంగా ఉంటుందని పరిశోధన స్పష్టం చేసింది. పీల్చే గాలిలో వైరస్ ఎలా మనుగడ సాగిస్తుందనే దానిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్లు యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన అధ్యయనం తేల్చింది.

ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం.. వంటి ప్రక్రియలు కరోనాను నిరోధించడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనంగా అధ్యయనం చెబుతోంది. “ప్రజలు సరిగా వెంటిలేషన్ లేని ప్రదేశాల్లో ఉంటే మాత్రం గాలిలో కాస్త ఎక్కువ సేపు ఉండే కరోనా సోకవచ్చునని అభిప్రాయపడింది అధ్యయనం.

గాలిలో ఉండే చిన్న బిందువులలో వైరస్ ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే దానిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. కొవిడ్‌ వ్యాప్తి కట్టడికి మాస్కుల వాడకం గురించి నొక్కి చెప్పారు. భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించడం, దూరాన్ని పాటించడం వల్ల కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాల్లో వైరస్‌ అధికంగా సంక్రమిస్తుందన్నారు. ప్రజలు దగ్గరగా ఉంటే కొవిడ్‌ సోకే ప్రమాదం ఎక్కువగానే ఉన్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. అత్యంత వ్యాప్తి కలిగిన కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌పై దక్షిణాఫ్రికాలో నిర్వహించిన రెండు పరిశోధనలు కీలక అంశాలను వెల్లడించాయి. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌లో లక్షణాలు లేని వ్యక్తులు అత్యధికంగా ఉన్నారని ఈ పరిశోధనలు తేల్చాయి. వీరు వాహకులుగా మారి వ్యాప్తిని మరింత రాజేస్తున్నట్లు తేలింది. ఉబుంటు, సిసోంకే పేర్లతో నిర్వహించిన పరిశోధనల్లో ఈ అంశం బహిర్గతమైంది.