President Macron : కొవిడ్ టీకా వేసుకునేవరకు ఇబ్బందిపెడుతూనే ఉంటా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫైర్..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనాకు తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే యూరోప్‌లో కోవిడ్ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది.

President Macron : కొవిడ్ టీకా వేసుకునేవరకు ఇబ్బందిపెడుతూనే ఉంటా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫైర్..

Covid President Macron Warns He Will 'hassle' France's Unvaccinated

President Macron : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనాకు తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే యూరోప్‌లో కోవిడ్ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ వేసుకోని వారిపై ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఎమ్మాన్యువ‌ల్ మాక్రాన్ (Emmanuel Macron) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యాక్సినేష‌న్ వ్యూహాన్ని ఆయన ప్రకటించారు. ఈ  సందర్భంగా మాక్రాన్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ వేయించుకోని వారి జీవితాల‌కు పరిమితులు విధించేలా చేస్తామని హెచ్చ‌రించారు.

ఫ్రాన్స్ ప‌త్రిక లీ పార్సియ‌న్‌కు ఇంట‌ర్వ్యూలో వ్యాక్సిన్ వేసుకోనివారిపై తీవ్రస్థాయిలో స్పందించారు. వ్యాక్సిన్ వేసుకోని వారిని ఇబ్బంది పెట్టాల‌ని ఉందన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ టీకా వేసుకునే వ‌ర‌కు ఆ ప‌నిచేస్తూనే ఉంటాన‌ని హెచ్చరించారు. మాక్ర‌న్ వ్యాఖ్యలను ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా ఖండించాయి. ఒక అధ్య‌క్షుడి హోదాలో ఉండి ఇలా మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు.

దేశంలోకి అడుగుపెట్టే ప్రతిఒక్కరికి కోవిడ్ పాసులు జారీ చేయాలని మాక్ర‌న్ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగానే ఇటీవల పార్ల‌మెంట్‌లో ఓ బిల్లును తీసుకొచ్చింది. బిల్లుకు వ్య‌తిరేకంగా కొంద‌రు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వేసుకోని వారిని బయటకు రాకుండా ఉండేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. టీకా తీసుకోనివారిని బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా రెస్టారెంట్లు, బార్లు, సినిమాల‌కు కూడా అనుమతించరు. అయితే ఈ బిల్లుపై చ‌ర్చ సమయంలో కొంద‌రు ఎంపీలు ఆందోళ‌నకు దిగారు. వ్యాక్సిన్ కోసం ఇలా బెదిరించడం సరైనది కాదని ఆరోపించారు.

బ‌ల‌వంతంగా వ్యాక్సిన్లు ఇప్పించడం స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్టేనని విమర్శించారు. ప్ర‌జాజీవితంలోకి రావాలంటే వ్యాక్సిన్లు త‌ప్ప‌నిస‌రిగా మాక్ర‌న్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోని వారిని జైలుకు పంపాలన్నారు. చివరికి జనవరి 15వ తేదీ నుంచి కోవిడ్ పాస్ లేకుండా రెస్టారెంట్లు, సినిమాలు, ప‌బ్‌ల‌కు అనుమతించేది లేదని అధ్యక్షుడు మాక్రన్ స్పష్టం చేశారు.

Read Also : Covid Coma : 28 రోజులుగా కోమాలో…వయగ్రా ఇచ్చిన తర్వాత కోలుకున్న నర్సు