Home » International » మరో బాంబు పేల్చిన WHO..కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో లేనట్లే
Updated On - 10:36 am, Sat, 5 September 20
By
madhuకరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోందని ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చింది. కొవిడ్-19ను సమర్థంగా తిప్పికొట్టే వ్యాక్సినేషన్ ఇప్పట్లో సాధ్యంకాదని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మధ్యకాలం వరకు కరోనాను కట్టడి చేసే విస్తృత వ్యాక్సిన్‌ను చూస్తామని తాము భావించడంలేదని WHO అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ అభిప్రాయపడ్డారు.
వివిధ ఔషధ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కరోనాపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో, ఎంతవరకు రక్షణ కల్పిస్తాయో తేలాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యాక్సిన్‌న్ల మూడో దశ ప్రయోగాలకు అధిక సమయం పడుతుందని, ఆయా వ్యాక్సిన్‌లు కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయా?.. ఒకవేళ రక్షణ కల్పిస్తే ఏ మేరకు సురక్షితం అనే అంశాలను జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇటీవలే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. WHO అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైఖెల్ జె.ర్యాన్. వచ్చే 2021 ప్రారంభం వరకు వ్యాక్సిన్ ఆశించొద్దంటూ కీలక ప్రకటన చేశారు. అయితే..డబ్లూహెచ్ వోపై పలు విమర్శలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ దేశాలు కరోనా వైరస్ అల్లాడిపోతున్నాయి. మందు లేక..వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో రష్యా వ్యాక్సిన్ తయారు చేసి విడుదల చేసింది. కానీ…రష్యా వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్యసంస్థ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్’ అడ్వాన్స్ స్టేజ్ లో లేదని స్పష్టం చేసింది..
వ్యాక్సిన్ తీసుకున్న 26వేల మందికి కరోనా
పాట్నా ఎయిమ్స్ లో 384మంది వైద్య సిబ్బందికి కరోనా
India’s export of liquid oxygen: కరోనా వేళ..9,234మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను విదేశాలకు అమ్మిన భారత్
Mamata Banerjee : కరోనా “సెకండ్ వేవ్” మోడీ సృష్టించిన విపత్తే
corona Effect on Tollywood : ‘సినిమా’ కష్టాలు.. సెకండ్ వేవ్ కారణంగా 15 వేల కుటుంబాలు రోడ్డు పాలు..
Delhi Police: కొవిడ్ హాస్పిటల్లో బెడ్ దొరక్క హెడ్ కానిస్టేబుల్ మృతి