కరోనా బేబీస్, కరోనా డైవోర్స్.. లాక్‌డౌన్ జీవితం ఎలా ఉందంటే?

  • Published By: vamsi ,Published On : April 3, 2020 / 12:48 PM IST
కరోనా బేబీస్, కరోనా డైవోర్స్.. లాక్‌డౌన్ జీవితం ఎలా ఉందంటే?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మనుషులను మార్చేస్తోంది. ప్రేమ, డేటింగ్, రొమాన్స్ ఒక్కటేంటి? చివరకు ఫ్యామిలీ రిలేషన్స్ తీరు కూడా మారుతోంది. 10 వారాల్లో పదితరాలుగా మనం పెంచుకున్న, నమ్ముకున్న సామాజిక, వ్యక్తిగత సంబంధాలను మార్చేసింది. డేటింగ్, రొమాన్స్ ఆన్‌లైన్ ఎక్కింది. పెళ్లిళ్లు పోస్ట్‌పోన్ అయ్యాయి. చైనాలో నెలల తరబడి లాక్‌డౌన్‌లో ఉండేసరికి, భార్యభర్తల మధ్యల మధ్య పెరిగింది ఎడం. ఒక్కసారి లాక్‌డౌన్‌ను ఎత్తివేసేసరికి, లాయర్ల దగ్గరకు పరిగెత్తారు. ఇక ప్రేమికులు విరహంతో అల్లల్లాడిపోయారు. కటుంబానికి దూరమై అమ్మాయిలు, అబ్బాయిలు మానసికంగా దెబ్బతిన్నారు.

ఇప్పుడు మానవజాతికి అనుసంధానకర్తగా ఇంటర్నెట్ మరోసారి అవతరించింది.  కోట్లాదిమంది సింగిల్స్, రూమ్స్‌లో చిక్కుకుపోయి, వీడియో కాల్స్‌తో కనెక్ట్ అయ్యారు. digital drag queen karaoke parties, వాట్స్ అప్ చాట్స్..అంతే.  

 లండన్, ఢిల్లీ, ముంబై, మాడ్రిడ్, ప్యారిస్ లాంటిచోట్ల ఇక పెట్స్ కాస్తంత తోడు, ఊరట. ప్యారిస్‌లో రోజుకి ఒకసారి కుక్కని బైటకు తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇచ్చారు.  డాక్టర్ దగ్గరకెళ్లడానికి, సరుకులను కొనడానికి మాత్రమే పర్మిషన్ ఉంది.

ఈ సంక్షోభం కొత్త పదాలను సృష్టించింది.  ఒకప్పుడు “blackout babies,”ఉండేవాళ్లు. ఇప్పుడు “coronababies”ని మనం ఆశించొచ్చు. అంటే కరోనా లాక్‌డౌన్ సమయంలో పుట్టినవాళ్లకు ఈ పేరుపెడుతున్నరు కొందరు పేరెంట్స్. 2033 నాటికి “quaranteens” అనిపిలిచే కొత్తతరం రాబోతోంది.  ఒకవేళ లాక్‌డౌన్‌తో వారాల తరబడి బతకలేక, గొడవలొచ్చి విడాకులు తీసుకొంటే“covidivorce అని పేరుపెడుతున్నారు.

అమెరికా, యూరోప్‌లో ఒక జోక్ బాగా నడుస్తోంది. నచ్చినవాళ్లు కనిపిస్తే.. ఇతనితో నేను క్వారంటీన్‌లో నెలలు ఉండగలనా? అతను టాయిలెట్ పేపర్‌ను సంపాదించగలడా? ఇలానే యూత్ అనుకొంటారని జోక్స్ వినిస్తున్నాయి. Hong Kongలో  Valentine’s Dayరోజున మాస్క్‌లు, ఆల్కహాల్ వైప్స్‌ను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇవే వాలంటీన్స్ గిఫ్ట్స్. ఇక రోజ్ ఫ్లవర్స్ సేల్స్ 90పర్సెంట్ తగ్గిపోయింది. ఇండియాలో ఐతేcondoms, ఐపిల్  లాంటిcontraceptives సేల్స్ బాగా పెరిగిపోయాయి.

ఇప్పుడు రిలేషన్స్‌ను మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమే. ప్రేమ, ఇష్టం కన్నా హెల్త్ ముఖ్యమైపోయింది. అంతందుకు… ఆర్జెంటీనాలో గర్ల్ ఫ్రెండ్‌ను చూడటానికి స్పెయిన్ నుంచి కుర్రాడు వస్తే… అధికారులకు ఫోన్ చేసి…ఆ అమ్మాయే పట్టించింది. అతన్నికూడా కలవలేదు. భవిష్యత్తులో ఫ్రెండ్‌షిప్, లవ్‌ల మధ్యకూడా సోషల్ డిస్టెన్స్ తెలియకుండా కూడా ప్రధాన పాత్రను పోషిస్తుందని సైకాలజిస్ట్ లు అంటున్నారు.

Parisలోని professor of sociology at Sciences Po, Sean Safford ఓ మాటన్నారు. ఆమె ఏడేళ్ల కొడుకు, భర్తతో కలసి సిటీలో చిక్కుకుపోయారు. కరోనాలాంటి విపత్తు సమయంలో కుటుంబానికి దగ్గరగా ఉండటం, ప్రేమించినవాళ్లు పక్కనుండాలనుకోవడం మానవనైజమని, కరోనా ఈ విషయాన్ని అందరికీ గుర్తుచేసిందని అంటున్నారు. ఫ్రాన్స్ లో ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు, అమెరికాలో సెప్టెంబర్ 11 దాడుల్లోనూ జనం ఏకమైయ్యారు. సమాజరక్షణకోసం
చాలామంది ముందుకొచ్చారు. కష్టకాలంలో సమాజాన్ని అందరూ కోరుకొంటారని ఆమె నమ్మకం. ఇప్పుడు జరుగుతోందికూడా అదే.