సుదూర బాటసారి, 4వేల కిమీ ప్రయాణించి రాజస్తాన్ చేరుకున్న రష్యన్ కొంగ

సుదూర బాటసారి, 4వేల కిమీ ప్రయాణించి రాజస్తాన్ చేరుకున్న రష్యన్ కొంగ

russia Crane Reach Rajasthan: కొంగలు వలస పక్షులు అన్న విషయం తెలిసిందే. ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వస్తుంటాయి, వెళ్తుంటాయి. కొన్ని కొంగలు వందలు, వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ వలస వస్తుంటాయి. ఇది కామన్. కానీ రష్యాకి చెందిన ఓ కొంగ(క్రేన్) సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ రష్యన్ కొంగ ఏకంగా 4వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇండియాలోని రాజస్తాన్ చేరుకుంది. ఇప్పుడీ విషయం ఇంట్రస్టింగ్ గా మారింది.

రష్యాలోని ట్రాన్స్ బైకాలియాలో ఉండే ఓ కొంగ ఆదివారం రాజస్తాన్ జోద్ పూర్ లోని కించన్ గ్రామంలో కనిపించింది. 4వేల 368 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ ఆ కొంగ ఇక్కడికి చేరుకుంది. వలస వచ్చే పక్షుల్లో ఇంత దూరం ప్రయాణం చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని అధికారులు తెలిపారు.

ఆ కొంగను Demoiselle(డెమోయిసెల్లె)గా గుర్తించారు. Grus virgo జాతికి చెందినది. సాధారణంగా ఈ జాతి కొంగలు సెంట్రల్ యూరో సైబీరియాలో కనిపిస్తాయి. బ్లాక్ సీ నుంచి మంగోలియా, నార్త్ ఈస్ట్రన్ చైనా ప్రాంతాల్లో కనిపిస్తాయి. టర్కీలోనూ ఈ జాతి కొంగలు (స్వల్ప జనాభా) కనిపిస్తాయి. ఈ కొంగలు వలస పక్షులు. వెస్ట్రన్ యురేసియా నుంచి వచ్చే పక్షులు శీతాకాలంలో ఆఫ్రికాలో గడుపుతాయి. ఆసియా, మంగోలియా, చైనాకి చెందిన వలస కొంగలు శీతాకాలంలో భారత్ లో విడిది చేస్తాయి. ఈ రష్యన్ కొంగ.. భారత్-పాకిస్తాన్ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. భారత్-పాకిస్తాన్ లో వీటిని కుంజ్(koonj) అని పిలుస్తారు.

పక్షుల పరిశీలకుడు సేవారామ్ మాలి రష్యన్ కొంగని కించన్ గ్రామంలో చూశాడు. వెంటనే ఈ విషయాన్ని వలస పక్షుల నిపుణుడు డాక్టర్ దౌ లాల్ బోహ్రాకు తెలిపాడు. ఆయన వెంటనే దాన్ని గుర్తించాడు. అది 2019 ఆగస్టు 2న రష్యాలోని ట్రాన్స్ బైకాలియాలో కనిపించిందని చెప్పారు. ప్రస్తుతం ఆ కొంగ రెండో శీతాకాలం కోసం భారత్ కు వచ్చిందన్నాడు.

ఈ జాతికి చెందిన ఓ పక్షి జనవరి 17లో కనిపించింది. అది గుజరాత్ లో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు రాజస్తాన్ లో కనిపించింది రెండో కొంగ. సుదూర ప్రయాణం చేసి రాజస్తాన్ చేరుకుంది.