Cremation Ashes Jewellery: అస్థికలతో తయారు చేసిన నగలకు ఫుల్ డిమాండ్ Cremation ashes jewellery is a new trend

Cremation Ashes Jewellery: అస్థికలతో తయారు చేసిన నగలకు ఫుల్ డిమాండ్

అస్థికలతో తయారు చేసిన నగలు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గా మారాయి. చనిపోయిన మనిషి అస్థికలు కేవలం పుణ్యజలాల్లో కలపటానికే కాదు నగలు ట్రెండ్ గా మారాయి.

Cremation Ashes Jewellery: అస్థికలతో తయారు చేసిన నగలకు ఫుల్ డిమాండ్

Cremation Ashes Jewellery: బంగారు ఆభరణాలకు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ధర ఎంత పెరిగినా కొంటునే ఉంటారు. అలాగే నవరత్నాలతో తయారయ్యే నగలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇంకాస్త శ్రీమంతులైతే ప్లాటినమ్ ఆభరణాలు కొంటుంటారు. కానీ..మనిషి అస్థికలతో తయారయ్యే ఆభరణాల గురించి తెలుసా? వాటికి కూడా మంచి డిమాండ్ ఉందనే విషయం తెలుసా? వినటానికి కాస్త భయంగా ఉన్నా..విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే. మనిషి చనిపోయిన తరవాత వచ్చే అస్థికలతో ఆభరణాలను తయారు చేస్తున్నారు. వాటికి ఫుల్ డిమాండ్ ఉండటం మరో విశేషం.

నగల తయారీల్లో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో దుస్తులకు, నగల డిజైన్ల ట్రెండ్ మారిపోతోంది. ఇలా మారే కొద్దీ ఆభరణాల తయారీ విధానం కూడా మారిపోతుంటుంది. ట్రెండ్ అంటే డిజైన్స్ మారతాయి. పూసలు, రాళ్లతో తయారు చేసే నగలకు ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది. ధరించే దుస్తుల కలర్ ను బట్టి పూసల డిజైన్ నగలు మంచి ఫ్యాషన్ గా మారాయి. కానీ ట్రెండ్ ఎంత మారిని బంగారం, వెండి,వజ్రరాలతో తయారయ్యే నగలు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

Read more : Diamond Gold Rainstorm: వజ్రాల గొడుగు..అరకిలో బంగారం,12 వేల డైమండ్లతో తయారీ

కానీ అస్థికలతో తయారయ్యే ఆభరణాలు అంటే కాస్త విడ్డూరంగానే ఉంటుంది. కానీ అస్థికలతో తయారయ్యే నగలకు యూఎస్ లో మంచి డిమాండ్ ఉంది. అసలు అస్థికలతో ఆభరణాలు ఎందుకు తయారు చేస్తున్నారు? ఎందుకు? ఎవరు తయారు చేస్తున్నారు? వంటి డౌట్స్ వచ్చి తీరతాయి. అస్థికలు అంటే సెంటిమెంట్. అలాగే ఈ అస్థికల నగలు కూడా సెంటిమెంట్ అనే చెప్పాలి.

అమెరికాలో న్యూయార్క్‌లోని మార్గరెట్ క్రాస్ అనే సంస్థ ఈ అస్థికల ఆభరణాల్ని తయారు చేస్తోంది. అస్థికల అవశేషాలతో ఏకంగా రింగ్, బ్రాస్‌లెట్, ఛైన్స్ అన్నీ తయారు చేసేస్తోంది. మరణించిన వ్యక్తుల ఎముకలతో పాటు వారి దంతాలు, జుట్టు, గోళ్లు, వంటివాటితో నగల్ని తయారు చేస్తోందీ సంస్థ. ఆత్మీయులు, కుటుంబసభ్యులు మరణంతో దూరమైనప్పుడు వారికి గుర్తుగా ఏదో ఒక వస్తువును ఉంచుకుంటారు సాధారణంగా వారి బంధువులు. సరిగ్గా ఈ ఆలోచన చేసిన మార్గరెట్ క్రాస్ సంస్థ ఆ సెంటిమెంట్ ను వ్యాపారంగా మార్చింది. దీంట్లో భాగంగానే అస్థికల ఆభరణాలు తయారు చేసే యోచన. చనిపోయినవారి అస్థికలతో, శరీర భాగాలతో ఆభరణాలు తయారు చేసి ధరిస్తే..వారంతా తమతోనే ఉంటారనేది అమెరికాలో ఓ నమ్మకం. మరణించినవారి జుట్టుతో కూడా నగలు తయారు చేస్తారు. జుట్టుని ఉంగరాల్లో భద్రపరి తయారుచేస్తారు.

Read more : Two Goggles auction : వేలానికి రెండు కళ్లజోళ్లు..ధర రూ.రూ.25 కోట్లు

అలాగే దంతాలతో కూడా నగలు తయారు చేస్తోందీ సంస్థ. కానీ ఇటువంటి నగలను వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. ఎవరి నమ్మకాలు వారివి కదా..కానీ తమ ఆత్మీయులు తమకు మరణం ద్వారా దూరమైనా..తమతో ఉండాలని అనుకునేవారు యూఎస్ లో ఎక్కువమందే ఉన్నారు.వీరు అస్థికల ఆభరణాలకు విలువనిస్తున్నారు. ఆ ఆలోచనకు ‘లవ్ అండ్ లాస్’ అనే పేరు పెట్టారు. ఈ కొత్త ఆలోచన ప్రజలకు నచ్చుతోంది. దాన్ని దగ్గరచేసుకుంటున్నారు. దీంతో అస్థికలతో తయారు చేసిన నగరలకు క్రేజ్ పెరుగుతోంది. అస్థికల నగలే కదా..పెద్ద ధర ఉండదు అనుకుంటే పొరపాటే. అస్థికలే కదా చవగ్గా ఉంటాయని అస్సలు అనుకోవద్దు. ఈ అస్థికల ఆభరణాల ధర ఎక్కువే. ఎందుకంటే ఈ అభరణాల్ని తయారు చేసేందుకు చాలా సమయం పడుతుందట. పైగా సెంటిమెంట్ ఉండనే ఉంది. వ్యాపారంలో సెంటిమెంట్ ఉండకపోవచ్చు గానీ..సెంటిమెంటే వ్యాపారం అని చెప్పాల్సిందే.

Read more : 1765 Antarctic Air : 1765 నాటి ‘గాలితో శిల్పం’..త్వరలో ‘పోలార్‌ జీరో ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శన

×