Andrew Symonds: సైమండ్స్ మృతి దిగ్భ్రాంతి కలిగించింది.. సంతాపం తెలిపిన సహచర క్రికెటర్లు.. ఎవరు ఏమన్నారంటే..

Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్ మరణ వార్తవిని క్రికెట్ ప్రపంచం నివ్వెర పోయింది. కారు ప్రమాదంలో సైమండ్స్ మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని సహచర క్రికెటర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆండ్రూ సైమండ్స్ తో ఉన్న అనుబంధాన్ని, అతని మంచి తనాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు నివాళులర్పించారు. ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మృతి చెందినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఆదివారం వెల్లడించింది. కారు ప్రమాదంలో సైమండ్స్ మరణించారనే వార్త వెలువడిన వెంటనే అతని క్రికెట్ సహచరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆల్ రౌండర్‌కు నివాళులు అర్పించారు. సైమండ్స్‌కు భార్య లారా, చిన్న పిల్లలు క్లో, బిల్లీ ఉన్నారు.
Vale Andrew Symonds.
We are shocked and saddened by the loss of the loveable Queenslander, who has tragically passed away at the age of 46. pic.twitter.com/ZAn8lllskK
— Cricket Australia (@CricketAus) May 15, 2022
క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ లాచ్లాన్ హెండర్సన్ సైమండ్స్ మృతి పట్ల సంతాపం తెలిపారు.. ఆస్ట్రేలియన్ క్రికెట్ మరో అత్యుత్తమమైన ఆటగాడిని కోల్పోయింది. ఆండ్రూ రెండు ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా క్వీన్స్లాండ్ తరఫున కూడా గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. తన ఆటతో ఎనలేని అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఈ కష్ట సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తరపున ఆండ్రూ కుటుంబానికి, సన్నిహితులు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు.
We express our deepest sympathies to Andrew's family.
We are all hurting and will miss him greatly. His former teammates will remember his loyalty & recall the fun times with great fondness.
Full statement from QC Chair & former teammate Chris Simpson: https://t.co/nUjs6AsxXM pic.twitter.com/L68HQEO6Bk
— Queensland Cricket (@qldcricket) May 15, 2022
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ సహచర ఆటగాడు సైమండ్స్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసాడు. సైమండ్స్ మరణవార్త తననెంతో బాధించిందని అన్నారు. ప్రేమగా, సరదాగా ఉండే స్నేహితుడిని కోల్పోవడం అత్యంత బాధాకరం అంటూ గ్రిల్ కిస్ట్ బాధను వ్యక్తం చేశారు.
Think of your most loyal, fun, loving friend who would do anything for you. That’s Roy. 💔😞
— Adam Gilchrist (@gilly381) May 15, 2022
ఆండ్రూ సైమండ్స్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని భారత్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఆయన తన సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలిపుతూ సైమండ్స్ ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Shocked to hear about the sudden demise of Andrew Symonds. Gone too soon. Heartfelt condolences to the family and friends. Prayers for the departed soul 🙏#RIPSymonds
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 15, 2022
ఆండ్రూ సైమండ్స్ మృతి పట్ల భారత్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. మృతిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Shocking news to wake up to here in India. Rest in peace my dear friend. Such tragic news 💔🥲 pic.twitter.com/pBWEqVO6IY
— VVS Laxman (@VVSLaxman281) May 15, 2022
ఆండ్రూ సైమండ్స్ మరణ వార్త విషాదాన్ని కలిగించిందని, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు భారత్ మాజీ క్రికెటర్ అనిల్ కూంబ్లే తన సానుభూతి తెలిపారు.
Tragic news to hear of Andrew Symonds passing. Condolences to his family, friends and well wishers.
— Anil Kumble (@anilkumble1074) May 15, 2022
ఆస్ట్రేలియాలో కారు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మరణం తనను తీవ్ర విషాదానికి గురిచేసిందని పాకిస్థాన్ మాజీ పాస్ట్ బౌలర్ సోయబ్ అక్తర్ అన్నారు. ఈ సందర్భంగా సైమండ్స్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మైదానంలో, బయట సైమండ్స్ ఎంతో కలివిడిగా ఉండేవాడని, అలంటి స్నేహితుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Devastated to hear about Andrew Symonds passing away in a car crash in Australia. We shared a great relationship on & off the field. Thoughts & prayers with the family. #AndrewSymonds pic.twitter.com/QMZMCwLdZs
— Shoaib Akhtar (@shoaib100mph) May 14, 2022
1Andrew Symonds: సైమండ్స్ మృతి దిగ్భ్రాంతి కలిగించింది.. సంతాపం తెలిపిన సహచర క్రికెటర్లు.. ఎవరు ఏమన్నారంటే..
2Ranveer Singh : రాజమౌళి అంటూ అరుస్తూ, పొగుడుతూ ఇంటర్వ్యూలో హడావిడి చేసిన బాలీవుడ్ హీరో..
3Anger : కోపంతో ఊగిపోతున్నారా! అయితే జాగ్రత్త పడాల్సిందే
4NV Ramana : మంచి తెలుగు సినిమాలు రావట్లేదు.. తెలుగు సినిమాలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ వ్యాఖ్యలు..
5Ajwain : బరువును తగ్గించి, ఆకలిని పెంచే వాము!
6Movie Tickets : తెలంగాణాలో పెరుగుతున్న సినిమా టికెట్ రేట్లు.. CS సోమేశ్కుమార్కి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త..
7Rahul Gandhi: రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతున్నారా?
8G7-Foreign Ministers: ప్రపంచానికి అన్నం పెట్టండి: గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్‌కు జీ7 నేతల విజ్ఞప్తి
9Imran Khan: నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది.. దేశం మీద అణుబాంబు వేయడమే నయం..!
10Pragathi : జిమ్‌లో కష్టపడుతున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి
-
Gun Firing in US: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం: 13 మంది మృతి
-
Pregnant Lady: భర్తతో విసిగిపోయి 65 కిమీలు కాలి నడకన బయలుదేరిన నిండు గర్భిణీ: చివరకు రోడ్డుపై ప్రసవం
-
Amit Shah : తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : అమిత్ షా
-
Southwest Monsoon : ఐఎండీ చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
-
CM Manik Saha : త్రిపుర నూతన సీఎంగా మాణిక్ సాహా
-
Guntur GGH : కంటి ఆపరేషన్ కు వెళ్తే ప్రాణం తీశారు.. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి
-
Pragya Reddy : ‘నన్ను చంపడానికి ప్రయత్నించారు’.. పుల్లారెడ్డి మనవడిపై అతని భార్య సంచలన ఆరోపణలు
-
Biplav Dev : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా