Andrew Symonds wife: సైమండ్స్ కుటుంబ నేపథ్యం.. ప్రమాద సమయంలో భార్య, పిల్లలు ఎక్కడున్నారు..

ఆస్ట్రేలియన్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మృతి క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సైమండ్స్ మృతికి తాజా, మాజీ క్రికెటర్లు సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యులకు ప్రగాభ సానుభూతిని తెలియజేస్తున్నారు...

Andrew Symonds wife: సైమండ్స్ కుటుంబ నేపథ్యం.. ప్రమాద సమయంలో భార్య, పిల్లలు ఎక్కడున్నారు..

Symonds Wife

Andrew Symonds wife: ఆస్ట్రేలియన్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మృతి క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సైమండ్స్ మృతికి తాజా, మాజీ క్రికెటర్లు సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యులకు ప్రగాభ సానుభూతిని తెలియజేస్తున్నారు. సైమండ్స్ తన సహచర క్రికెట్లు, కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్నంగా మెలిగేవాడు. దీంతో సైమండ్స్ మృతిని సహచర క్రికెటర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. అతనితో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ‘మిస్ యూ సైమో’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Andrew Symonds (3)

ఆండ్రూ సైమండ్స్ భార్య లారాను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కొడుకు బిల్లీ, కుమార్తె క్లోలో. వారిద్దరూ 2004లో మొదటిసారి కలుసుకున్నారు. కొడుకు పుట్టిన ఒక సంవత్సరం తర్వాత 2014లో పెళ్లి చేసుకున్నారు. ఆండ్రూ సైమండ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నప్పుడు లారా తన కుమార్తెకు జన్మనివ్వడానికి ఆస్పత్రిలో ఉంది. దీంతో సైమండ్స్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తరువాత ఆస్ట్రేలియాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు.

Symonds

ఆండ్రూ సైమండ్స్ మరణ వార్త విన్నప్పుడు లారా, బిల్లీ, క్లోలు సిడ్నీలో ఉన్నారు. విషాద వార్త తర్వాత వారు ముగ్గురూ సిడ్నీ నుండి టౌన్స్‌విల్లేకు బయలు దేరి వెళ్లారు. సైమండ్స్ మృతితో ఆమె కన్నీరుమున్నీరు అయ్యారు. “మేము ఇంకా షాక్‌లో ఉన్నాము, నేను ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తున్నాను’’ అని లారా స్థానిక మీడియాకు తెలిపారు. సైమండ్స్ చాలా పెద్ద వ్యక్తి, అతను పిల్లలతో చాలా ఎక్కువ సమయం గడేపేందుకు ఇష్టపడేవాడని లారా తెలిపింది. అతను ఎల్లప్పుడూ అందరి కోసం సమయాన్ని కేటాయిస్తూ సంతోషంగా ఉండేవారని లారా తెలిపింది.

Andrew Symonds (4)

ఆండ్రూ సైమండ్స్ యూకేలో జన్మించాడు. అతని తల్లిదండ్రులలో ఒకరు ఆఫ్రో-కరేబియన్ కాగా, మరొకరు యూరోపియన్ సంతతికి చెందినవారు. ఆ తర్వాత అతడిని బార్బరా, కెన్ అనే ఆంగ్ల దంపతులు దత్తత తీసుకున్నారు. కెన్, బార్బరా దంపతులు ఆండ్రూ సైమండ్స్‌కు కేవలం మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడు ఆస్ట్రేలియాకు తీసుకొని వెళ్లారు.