Cryptocurrency Mining : చైనా దెబ్బకు క్రిప్టో కంపెనీలు డీలా.. కరెంట్‌ కోతలతో కజకిస్తాన్ విలవిల!

డ్రాగన్ చైనా దెబ్బకు క్రిప్టో కంపెనీలు లబోదిబోమంటున్నాయి. కరెంట్ కోతలతో విలవిలలాడిపోతున్నాయి. క్రిప్టో కరెన్సీ మైనింగ్ బ్యాన్ చేయడాన్ని కొన్ని దేశాలు సమర్థిస్తున్నాయి.

Cryptocurrency Mining : చైనా దెబ్బకు క్రిప్టో కంపెనీలు డీలా.. కరెంట్‌ కోతలతో కజకిస్తాన్ విలవిల!

Cryptocurrency Mining Is Causing Power Shutdowns In Kazakhstan, And China May Be To Blame

Cryptocurrency Mining : డ్రాగన్ చైనా దెబ్బకు క్రిప్టో కంపెనీలు లబోదిబోమంటున్నాయి. కరెంట్ కోతలతో విలవిలలాడిపోతున్నాయి. క్రిప్టో కరెన్సీ మైనింగ్ బ్యాన్ చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయాన్ని క్రిప్టో కంపెనీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలతో మూర్ఖంగా వ్యవహరిస్తుందంటూ తిట్టిపోస్తున్నాయి. కానీ, చైనా తీసుకున్న నిర్ణయం సరైనదనంటూ కొన్ని దేశాలు ఇప్పుడు సమర్థిస్తున్నాయి. క్రిప్టోకరెన్సీకి ఎక్కడ భారీ మార్కెట్ ఏర్పడుతుందోనన్న ఆలోచనతో ముందుజాగ్రత్త చర్యగా చైనా తమ దేశంలో క్రిప్టో మైనింగ్ ను పూర్తిగా నిషేధం విధించింది.

అసలు క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదంటూ బ్యాన్ చేసేసింది. 2021 మేలో చైనా స్టేట్ కౌన్సిల్ బిట్ కాయిన్ మైనింగ్ మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. క్రిప్టో మైనింగ్ కారణంగా కర్బన ఉద్గారాలు వెలువబడి వాతావరణ కాలుష్యానికి గురి అవుతుందని, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని చైనా అభిప్రాయపడింది. అంతేకాదు.. క్రిప్టో మైనింగ్ తయారీకి భారీగా విద్యుత్ ఖర్చు చేయాల్సి వస్తుందని, ఫలితంగా కరెంట్ కోతలు ఏర్పడతాయని చైనా ప్రకటించింది. అందుకే క్రిప్టో కరెన్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు చైనా స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో అప్పటివరకూ క్రిప్టోకరెన్సీ కోసం చైనాలో ఏర్పాటు చేసిన థర్మల్ కేంద్రాల్లోని క్రిప్టోకరెన్సీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. క్రిప్టో నిషేధం దెబ్బకు చేసేది ఏమిలే పక్క దేశాలకు పరుగులు పెట్టాయి. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. చైనా పక్క దేశాలతో ఎంత ఖర్చు అయినా పెట్టి క్రిప్టో మైనింగ్ తయారీకి క్రిప్టో కంపెనీలన్నీ ఒప్పందాలు చేసుకున్నాయి.

ఇప్పుడేమో చేతులేత్తేశాయి. క్రిప్టోకరెన్సీకి భారీ స్థాయిలో ఎనర్జీ అవసరం అవుతుంది. ఈ పరిస్థితిని ఊహించని కజకిస్తాన్ వంటి దేశాలు క్రిప్టో మైనింగ్ తయారీకి విద్యుత్ సరిపోవడం లేదు. కరెంట్ కోతలను ఎదుర్కొంటున్నాయి. కంప్యూటర్ ఫామ్ లు ఉండే కజికస్తాన్ లో కనీసం ఐదు గంటలు కూడా కరెంట్ ఉండే పరిస్థితి లేదు. కరెంట్ కోతలను అధిగమించేందుకు పవర్ పాట్లు పడుతున్నాయి. ప్రత్యేకించి రష్యా నుంచి అధిక ధరలు చెల్లించి మరి కజికస్తాన్ పవర్ కొనుగోలు చేస్తోంది. ఇలా అయితే కష్టమేనని భావించిన కజికిస్తాన్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు దిగింది. 2022 జనవరి నెల నుంచి క్రిప్టో మైనింగ్ తయారీకి వినియోగించే విద్యుత్ సరఫరాపై కఠిన నిబంధనలను విధించనుంది. ఇకపై క్రిప్టో మైనింగ్ కంపెనీలకు రేషన్ విధానంలో విద్యుత్ సరఫరా చేయనుంది. తీవ్రమైన కరెంట్ కోతలను అనుభవిస్తున్న దేశాల్లో ఒక కజికిస్తాన్ మాత్రమే కాదు.. ఇలాంటి 30కి పైగా విదేశాలు కరెంట్ కోతలతో విలవిలాడిపోతున్నాయి.

Read Also : Chinese Warplanes : తైవాన్ ను బలవంతంగా ఆక్రమించుకునేందుకు చైనా సిద్ధమైందా!