Mexico Airport Men’s Skulls : ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. సూట్ కేసులో మనుషుల పుర్రెలు గుర్తింపు

మెక్సికో ఎయిర్ పోర్టులో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఏకంగా మనుషుల పుర్రెలు బయటపడ్డాయి. మెక్సికో ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా కొరియర్ బాక్సుల్లో కనిపించిన పుర్రెలను చూసి అధికారులు షాక్ అయ్యారు.

Mexico Airport Men’s Skulls : సాధారణంగా ఎయిర్ పోర్టులో బంగారం, డ్రగ్స్, డబ్బును అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతుంటారు. కానీ మెక్సికో ఎయిర్ పోర్టులో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఏకంగా మనుషుల పుర్రెలు బయటపడ్డాయి. మెక్సికో ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా కొరియర్ బాక్సుల్లో కనిపించిన పుర్రెలను చూసి అధికారులు షాక్ అయ్యారు.

కొరియర్ బాక్సుల్లో వచ్చిన సూట్ కేసులను చెకింగ్ మిషన్ల సాయంతో అధికారులు తనిఖీ చేస్తుండగా అందులో మానవుల పుర్రెలు ఉన్నట్లు ఎక్స్ రే మిషన్ గుర్తించింది. దీంతో అధికారులు ఆ సూట్ కేసును తెరిచి చూస్తే అందులో నాలుగు మనిషి పుర్రెలు కనపించాయి.

Drugs Smuggling: కడుపులో 2.22 కేజీల డ్రగ్స్.. ముంబై ఎయిర్‌పోర్టులో దొరికిన దొంగలు!

సంబంధిత పత్రాల ఆధారంగా మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో ఒకటైన మిచోవాకాన్ నుంచి దక్షిణ కరోలినాకు పుర్రెలను కొరియర్ చేస్తున్నట్లు గుర్తించారు. కొరియర్ బాక్సుల్లో మనుషుల పుర్రెలు రావడంపై ఎయిర్ పోర్టు అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు