hair wigs : ఓర్నీ వేషాలు, బంగారం ఎక్కడ దాచాడో తెలుసా ?

హాలీవుడ్‌ రేంజ్‌లో థ్రిల్లర్‌‌ సీక్వెన్స్‌ పండించి అడ్డంగా దొరికిపోయారు గోల్డ్‌ స్మగ్లర్స్‌. సినీ ఫక్కీలో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ.. ఎయిర్‌పోర్ట్‌ను దాటించేయాలని చూశారు.

hair wigs : ఓర్నీ వేషాలు, బంగారం ఎక్కడ దాచాడో తెలుసా ?

hair wigs

Customs seizes : హాలీవుడ్‌ రేంజ్‌లో థ్రిల్లర్‌‌ సీక్వెన్స్‌ పండించి అడ్డంగా దొరికిపోయారు గోల్డ్‌ స్మగ్లర్స్‌. సినీ ఫక్కీలో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ.. ఎయిర్‌పోర్ట్‌ను దాటించేయాలని చూశారు. అయితే కస్టమ్స్‌ అధికారుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు. చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. బంగారం, విదేశీ కరెన్సీని విగ్గుల్లో పెట్టి, అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులను చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు పోలీసులు. వారి దగ్గర నుంచి 2.53 కోట్ల రూపాయల విలువ చేసే 5.55 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

రామనాథ పురానికి చెందిన మగ్రూబ్ అక్బరాలీ, చెన్నైకి చెందిన హసన్ రఫియుద్దీన్‌ల హెయిర్ స్టైల్ విచిత్రంగా ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. వారిని ఎగ్జిట్ గేట్ వద్ద ప్రశ్నించారు. పాక్షికంగా గుండు చేయించుకుని, విగ్గులు ధరించినట్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్థమైంది. వీరి విగ్గులలో రెండు బంగారం ముద్ద పొట్లాలు దొరికాయి. వీటిలో 698 గ్రాముల బంగారం ముద్ద ఉంది. మరోవైపు విదేశాల నుంచి కిలోలకొద్ది బంగారాన్ని వేర్వేరు స్టయిళ్లలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు దుండగులు. ఏకంగా కడుపులో బంగారం పెట్టుకుని మహిళలే స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి చిత్రవిచిత్రాలన్నింటికి చెన్నై ఎయిర్‌పోర్ట్‌ కేంద్రంగా నిలిచింది.