తోడు దొంగని కుక్కపిల్లను కూడా అరెస్టు చేసిన పోలీసులు 

ఫ్లోరిడాలోని దుకాణంలో దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తితోపాటు అతని కుక్క పిల్లను పోలీసులు అరెస్టు చేశారు.

  • Edited By: veegamteam , February 9, 2020 / 02:22 PM IST
తోడు దొంగని కుక్కపిల్లను కూడా అరెస్టు చేసిన పోలీసులు 

ఫ్లోరిడాలోని దుకాణంలో దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తితోపాటు అతని కుక్క పిల్లను పోలీసులు అరెస్టు చేశారు.

ఫ్లోరిడాలోని దుకాణంలో దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తితోపాటు అతని కుక్క పిల్లను పోలీసులు అరెస్టు చేశారు. లోగాన్ విల్సన్‌ అనే వ్యక్తి తనతోపాటు కుక్కపిల్లను కూడా తీసుకెళ్లి దుకాణాల్లో దొంగతనం చేశారు. దీంతో అతనితోపాటు కుక్క పిల్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

బుధవారం లోగాన్ విల్సన్‌ను అరెస్టు చేశామని, చిన్న దొంగతనం కేసులో మెత్ స్వాధీనం చేసుకున్నట్లు హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. విల్సన్ తోపాటు అతని కుక్క పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒక చిన్న కుక్కపిల్లని పట్టుకున్న అధికారిని ఫోటోను షెరీఫ్ కార్యాలయం ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసింది. 

బాస్ ప్రో షాపుల నుండి $ 259 విలువైన వస్తువులను దొంగిలించినట్లు విల్సన్ ఒప్పుకున్నాడని సహాయకులు చెప్పారు. దుకాణంలో దొంగతనం చేసి పారీ పొతుండగా ట్రాఫిక్ స్టాప్ వద్ద అతన్ని అరెస్టు చేశారు. కుక్కపిల్లను హిల్స్‌బరో కౌంటీ ఎనిమల్ సర్వీసెస్‌ సెంటర్ కు అప్పగించే ముందు సహాయకులు జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పారు.

విల్సన్.. జైలు నుండి విడుదలయ్యే వరకు జంతు సంరక్షణ కేంద్రం కుక్క పిల్లను జాగ్రత్తగా చూసుకుంటుంది. జంతు సంరక్షకులు కుక్కపిల్లని “ముందస్తు దత్తత తీసుకున్నట్లు” జాబితా తయారు చేశారు. యజమాని కుక్కను క్లెయిమ్ చేయకపోతే, దాన్ని జంతు సంరక్షణ కేంద్రం దత్తత తీసుకుంటుంది.