Cyclone Tauktae: లక్షదీవుల్ని అల్లాడించిన ‘తౌటే’

లక్షదీవులపై ‘తౌటే’ తుఫాను బీభత్సం సృష్టించింది. అల్లకల్లోలం చేసి పారేసింది. విరిగిన చెట్లు..కుప్ప కూలిన ఇళ్లు..ధ్వంసమైన పంటలు ఇలా నానా బీభత్సానికి గురిచేసింది. ప్రజల్ని బిక్కు బిక్కుమనేలా చేసింది.

Cyclone Tauktae: లక్షదీవుల్ని  అల్లాడించిన ‘తౌటే’

Cyclone Tauktae

Cyclone Tauktae Effect In lakshadweep : లక్షదీవులపై ‘తౌటే’ తుఫాను బీభత్సం సృష్టించింది. అల్లకల్లోలం చేసి పారేసింది. విరిగిన చెట్లు..కుప్ప కూలిన ఇళ్లు..ధ్వంసమైన పంటలు ఇలా నానా బీభత్సానికి గురిచేసింది. ప్రజల్ని బిక్కు బిక్కుమనేలా చేసింది. తుఫాను అంటేనే ప్రళయమే. అటువంటిది తౌటే తుఫాను ఏకంగా అతి తీవ్ర తుఫానుగా మారబోతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా లక్షదీవులు, కర్ణాటక తీరంపై తీవ్రంగా విరుచుకుపడింది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాను లక్ష దీవులపై తీవ్ర ప్రభావం చూపింది. దీన్ని ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులతో అల్లాడించింది. బీచ్‌లన్నీ అల్లకల్లోలమైపోయాయి. తీరం వెంట విరిగిపడిన చెట్లతో బీతావహంగా మారింది. చెట్లు ఇళ్లపై కూలిపడ్డాయి. పరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో జనాలు ఏం చేయాలో తెలియని ఆందోళనలో పడిపోయిరు. దీంతో విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయ చర్యల్లో తలమునకలయ్యాయి.

Cyclone Tauktae: అరేబియా సముద్రంలో వచ్చిన తౌతే తుఫాను లక్ష దీవులపై తీవ్ర ప్రభావం చూపింది. అక్కడ భారీ వర్షాలు, ఈదురు గాలులు వచ్చాయి. అక్కడి బీచ్‌లన్నీ అల్లకల్లోలంగా మారిపోయాయి. చెట్లు నేల కూలాయి. కొన్ని ఇళ్లపై కూలిపోయాయి. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి… సహాయ చర్యల్లో తలమునకలయ్యాయి.

ప్రస్తుతం తీవ్ర తుఫానుగా ఉన్న తౌటే అతి తీవ్ర తుఫానుగా మారనుందనే వార్తలతో జనాలు హడలిపోతున్నారు. ప్రస్తుతం ఇది ఉత్తరం, వాయవ్య దిశలో కదులుతూ ఎక్కడ దీని ప్రతాపం చూపిస్తుందోనని భయాందోళనలకు గురవుతున్న పరిస్తితి నెలకొంది. తౌటే గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గుండ్రంగా చక్కర్లు కొడుతోంది. ఎక్కడ విరుచుకుపడనుందో. రానున్న మంగళవారం అంటే 18 తేదీ ఉదయం సమయంలో… గుజరాత్ దగ్గర తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.

తౌటే గోవా నుంచి ముంబైవైపుగా కదులుతోంది. ఈ క్రమంలో ముంబైపై తీవ్ర ప్రభావం చూపిస్తూ.. ఆ తరువాత వంతుగా గుజరాత్‌కి కదలనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో… గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌పై దీని ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. ఈ రాష్ట్రాల తీరాల దగ్గర 53 NDRF బృందాలు ఆల్రెడీ సహాయ చర్యల్లో బిజీ బిజీగా ఉన్నాయి. అలాగే… SDRF టీమ్స్ కూడా సహాయక చర్యల్లో తలమునకలై ఉన్నాయి.

తౌటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కేంద్రం కూడా తౌటేను పరిశీలిస్తోంది. కరోనాతో ఇబ్బంది పడుతున్న సమయంలో తౌటే మరో సవాల్ విసురుతోందని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలు సూచనలు పాటించాలని ప్రధాని మోడీ తెలిపారు. కరోనా గురింంచి హైలెవెల్ మీటింగ్ లో మాట్లాడుతూ..టౌతే పరిస్థితుల గురించి కూడా తెలుసుకుని ఆయా అధికారులకు సూచనలిచ్చారు.

కాగా మహారాష్ట్ర ప్రభుత్వం తౌటేను ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా కరోనా రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరోవైపు భారత రైల్వే శాఖ కూడా… కొన్ని రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. అరేబియా సముద్రంలో చేపల వేట పూర్తిగా నిలిపివేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా తనవంతుగా సహాయక చర్యలో మునిగింది. ట్రాన్స్‌పోర్ట్ విమానాలు,హెలికాప్టర్లను రంగంలోకి దిగింది. మరోవైపు భారత నౌకాదళం కూడా గత నాలుగు రోజుల నుంచి సహాయ చర్యల్ని కొనసాగిస్తోంది.