D Mart Hits : దూకుడు మీదున్న D-Mart..సరికొత్త రికార్డు..

డీమార్ట్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ విలువ ఏకంగా రూ. 3 ట్రిలియన్లకు అంటే మూడు లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఘనతను సాధించిన 17 ఇండియన్‌ స్టాక్స్‌ లిస్టెడ్ కంపెనీగా డీమార్ట్ నిలిచింది.

D Mart Hits : దూకుడు మీదున్న D-Mart..సరికొత్త రికార్డు..

D Mart (1)

D Mart Hits 3 Trln In Market Capitalisation : డీమార్ట్. ఇంటికి కావాల్సిన అన్ని నిత్యావసర సరుకులతో పాటు అన్ని వస్తువులు లభించే మాల్. కూరగయాల నుంచి బట్టల వరకు అన్ని ఒకేచోట దొరికే చోటు డీమార్ట్. అటువంటి డీమార్ట్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. రిటైల్ చైన్ సూపర్‌ మార్కెట్స్‌ డీ-మార్ట్స్‌ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ సోమవారం (అక్టోబర్ 11,2021) సరికొత్త రికార్డును నమోదుచేసింది.

డీమార్ట్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ విలువ ఏకంగా రూ. 3 ట్రిలియన్లకు అంటే మూడు లక్షల కోట్లకు చేరుకుంది. ఈ అరుదైన ఘనతను సాధించిన 17 ఇండియన్‌ స్టాక్స్‌ లిస్టెడ్ కంపెనీగా డీమార్ట్ నిలవటం విశేషం. ఈ సంవత్సరంలో డీమార్ట్‌ షేర్లు భారీగా పెరిగాయి. ఎంతగా అంటే ఏకంగా 70 శాతం పెరిగాయి. ఇప్పటివరకు సుమారు షేర్లు 70% పైగా పెరిగాయి. డీమార్ట్ షేర్లు ఇంత భారీస్థాయిలో పెరగటంతో ఈ మార్కెట్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. బీఎస్‌ఈ స్టాక్‌ మార్కెట్‌లో సోమవారం రోజున డీమార్ట్‌ షేర్‌ విలువ రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ. 4,837ను తాకింది. దీంతో డీ మార్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ రూ. 3.11 ట్రిలియన్లకు చేరుకుంది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి డీ మార్ట్‌ షేర్‌ విలువ 7 శాతం పెరిగి..రూ. 4716.50 వద్ద నిలిచింది.

Read more : Switzerland : స్విస్ బ్యాంకు నుంచి భారతీయుల జాబితా వచ్చేసింది!

ప్రముఖ కంపెనీల సరసన నిలిచిన డీమార్ట్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒఎన్‌జిసి, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏషియన్ పెయింట్స్ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ మూడు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకున్న క్లబ్బులో ఇప్పుడు డీమార్ట్‌ కూడా చేరటం విశేషం.

Read more :Airport: ప్రపంచస్థాయిలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్.. రూ. 6300కోట్ల పెట్టుబడి