Paracetamol : రోజూ ప్యారాసెటమాల్ వాడితే ప్రాణాంతకమే..! గుండెపోటు ముప్పు అధికం

ప్రతి చిన్న నొప్పికి, తలనొప్పికి, ఒంటి నొప్పులు, జ్వరానికి ప్యారాసెటమాల్ మాత్రలు వేసుకునే వారికి ఇది హెచ్చరికే. నిత్యం ప్యారాసెటమాల్ మాత్రలు తీసుకునేవారికి గుండెపోటు..

Paracetamol : రోజూ ప్యారాసెటమాల్ వాడితే ప్రాణాంతకమే..! గుండెపోటు ముప్పు అధికం

Paracetamol

Paracetamol : కరోనావైరస్ మహమ్మారి వెలుగులోకి వచ్చాక డోలో ట్యాబ్లెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్‌ పేరు మారుమోగుతోంది. మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన మెడిసిన్‌గా డోలో ఆవిర్భవించింది. ఈ మహమ్మారి కాలంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన మెడిసిన్‌గా నిలిచింది. మార్చి 2020 నుంచి అమ్మకాల పరంగా ఈ డోలో 650 తిరుగులేకుండా దూసుకుపోతుంది. ఇందులో ఉండే మూలకం ప్యారాసెటమాల్.

ఒంట్లో ఏ మాత్రం నలతగా అనిపించినా.. ఏ కాస్త జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు అనిపించినా వెంటనే ‘డోలో 650’ తీసుకుంటున్నారు. చాలా సులభంగా అందుబాటులో ఉండడం, కొన్ని సందర్భాల్లో త్వరగా ఫలితం ఉండడంతో దీని వాడకం బాగా పెరిగిపోయింది. అయితే వెనకా ముందు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు డోలో ట్యాబ్లెట్‌ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదంటున్నారు వైద్య నిపుణులు.

Coconut Sugar : షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే కొబ్బరి చక్కెర

ప్రతి చిన్న నొప్పికి, తలనొప్పికి, ఒంటి నొప్పులు, జ్వరానికి ప్యారాసెటమాల్ మాత్రలు వేసుకునే వారికి ఇది హెచ్చరికే. నిత్యం ప్యారాసెటమాల్ మాత్రలు తీసుకునేవారికి రక్తపోటు పెరిగిపోవడం, గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువవుతుందని పరిశోధనలో వెల్లడైంది. గుండెపోటు, స్ట్రోక్స్ ముప్పు ఉన్న వారికి ప్యారాసెటమాల్ మాత్రలను సూచించే విషయంలో డాక్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని యూనివర్సిటీ ఆఫ్ ఎడింబర్గ్ పరిశోధకులు సూచిస్తున్నారు.

అధిక రక్తపోటు చరిత్ర ఉన్న 110 మంది రోగులపై వీరు పరిశోధన నిర్వహించారు. రెండు గ్రూపులుగా చేశారు. ఒక గ్రూపులోని వారికి ఒక గ్రాము (1000ఎంజీ) ప్యారాసెటమాల్ ను రోజూ నాలుగు సార్లు చొప్పున రెండు వారాల పాటు ఇచ్చారు. మరో గ్రూపులోని వారికి ఎటువంటి మందులేని ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ రెండు గ్రూపులను మార్చి.. ముందు ప్యారాసెటమాల్ ఇచ్చిన వారికి ఉత్తుత్తి ట్యాబ్లెట్, ఉత్తుత్తి ట్యాబ్లెట్ ఇచ్చిన గ్రూపులోని వారికి ప్యారాసెటమాల్ ఇచ్చి చూశారు.

ప్యారాసెటమాల్ తీసుకున్న వారిలో నాలుగు రోజుల్లోనే రక్తపోటు పెరగడాన్ని గుర్తించారు. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పును 20 శాతం పెంచుతుందని తెలుసుకున్నారు. ‘‘ఐబూప్రోఫెన్ వంటి మాత్రలకు ప్యారాసెటమాల్ సురక్షిత ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం ఉంది. తాజా ఫలితాల నేపథ్యంలో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ మప్పు ఉన్న వారికి ప్యారాసెటమాల్ ఇవ్వకపోవడాన్ని పరిశీలించాలి’’ అని ఎడిన్ బర్గ్ యూనివ్సిటీ ప్రొఫెసర్ వెబ్ అన్నారు.

నిజానికి డోలో ట్యాబ్లెట్‌ను కూడా డాక్టర్ల సూచన మేరకే తీసుకోవాలి. అయితే చాలామంది నేరుగా మెడికల్‌ షాప్‌కి వెళ్లి ట్యాబ్లెట్‌ తెచ్చుకొని చాక్లెట్లలా వేసేసుకుంటున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు డోలో ట్యాబ్లెట్‌ వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయని ఇటీవలే డాక్టర్లు వెల్లడించారు. 650 ఎమ్‌జీ అంటే చాలా ఎక్కువ డోస్‌తో కూడుకున్న ట్యాబ్లెట్. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే కడుపులో వికారం కలుగుతుంది. అలాగే కొందరిలో లోబీపీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక తల తిరగడం, నీరసంగా అనిపించడం, నిద్రమత్తుగా ఉండడం, మల బద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి.

డోలోను ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే కొందరిలో మలబద్దకం, స్పృహ తప్పిపోతున్నట్లు భావన కలుగుతుంది. అలాగే నోరు పొడిగా మారిపోతుంది. కొందరిలో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. మరీ పరిమితి మించితే ఇంకా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Soaked Nuts : తినటానికి ముందు గింజలను ఎన్ని గంటలు నానబెట్టాలి?…

కొందరిలో గుండె కొట్టుకునే వేగం పెరగడం, నాడీ మండల వ్యవస్థపై ప్రభావం పడడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జ్వరంగా అనిపించగానే డోలో వేసుకోకుండా ఇతర మార్గాలను అన్వేషించడం ఉత్తమం. జ్వరం, ఒంటి నొప్పి, తలనొప్పి ఎంతకీ తగ్గకపోతే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం.