Danger phthalates : మనం రోజూ వాడే ఈ కెమిక‌ల్ ఏటా లక్షమంది ప్రాణాలు తీసేస్తోందని మీకు తెలుసా?

మనం రోజూ వాడే ఈ కెమిక‌ల్ ఏటా లక్షమంది ప్రాణాలు తీస్తోంది. ఈ కెమికల్ వల్ల అకాలమరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Danger phthalates : మనం రోజూ వాడే ఈ కెమిక‌ల్ ఏటా లక్షమంది ప్రాణాలు తీసేస్తోందని మీకు తెలుసా?

Danger Phthalates

Danger phthalates అదో కెమిక‌ల్. ఆ కెమికల్ ను మనం ప్రతీరోజు వాడుతున్నాం. ఏదో రూపంలో ఆ కెమికల్ మ‌న శ‌రీరంలోకి వెళ్తూనే ఉంటుంది. అది ఎంత ప్రమాదమో మాత్రం మనకు తెలియదు. మనకు తెలియకుండానే దాన్ని మనం శరీరంలోకి పంపించి మన ప్రాణాలను మనమే తీసుకుంటున్నాం. ఆ కెమెకిల్ వల్ల అమెరికాలో ప్ర‌తి సంవత్సరం ల‌క్ష మంది చనిపోతున్నారని తాజాగా న్యూయార్క్ యూనివ‌ర్సిటీ చేసిన అధ్య‌య‌నంతో తేలింది. ఆ కెమిక‌ల్ గురించి పరిశోధకులు ఆందోళ‌న క‌లిగించే విష‌యాలు వెల్ల‌డించారు. అది మనిషికి ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం. అంత ప్రమాదంగా మారి మనిషి ప్రాణాలను తీస్తున్న ఆ కెమికల్ ఏమిటి? ఎలా హాని చేస్తోందో ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటోంది అధ్యయనంలో తేలిన ఫలితాలను ప్రచురించిన ఎన్విరాన్‌మెంట‌ల్ పొల్యూష‌న్ జర్న‌ల్‌.

Read more :Cities floating on water : నీటిపై తేలియాడే నగరాలు!..యూరప్ దేశాల్లో ప్రయోగాలు…ఇటువంటి పరిస్థితులు దేనికి సంకేతాలు?!

ఇంత‌కీ ఏమిటా కెమిక‌ల్‌?
మనిషి ప్రాణాలు తీసే ఆ కెమికల్ పేరు థాలెట్స్‌(phthalates). ఇది ఒక ర‌సాయ‌నాల స‌మూహం. మ‌నం వాడే ప్లాస్టిక్ వల్ల మన శరీరంలోకి వెళుతోంది. ప్లాస్టిక్ నుంచి మేక‌ప్ సామ‌గ్రి వ‌ర‌కూ చాలా వాటిలో ఈ థాలెట్స్ ను వినియోగిస్తారు. బొమ్మ‌లు, బ‌ట్టలు, షాంపోలు ఇలా ప్ర‌తి రోజూ వాడే వ‌స్తువుల్లో ఈ థాలెట్లు ఉంటాయి. ఈ కెమిక‌ల్‌ మన హార్మోన్‌ల‌కు హాని కలిగిస్తోంది. మన ఎండోక్రైన్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతోంది.

న్యూయార్క్ యూనివ‌ర్సిటీకి చెందిన గ్రాస్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించిన ఈ అధ్యనయంలో భాగంగా 55 నుంచి 64 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న 5 వేల మందిని పరిశీలించారు. వాళ్ల యూరిన్‌లో థాలెట్ల స్థాయి ఎక్కువగా ఉందని తేలింది. దీని వల్లనే వారిలో గుండె జ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్లు పరిశోధకులు గుర్తించారు. థాలెట్ల ప్రభావంతో వచ్చిన గుండె జ‌బ్బుల కార‌ణంగానే ప్రాణాలు కోల్పోతున్నారని అధ్య‌య‌నంలో వెల్లడైంది. థాలెట్లు నేరుగా మ‌ర‌ణానికి కార‌ణం కాక‌పోయినా.. గుండె జ‌బ్బుల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు.

Read more :Amazon WFH : అమెజాన్‌ ఉద్యోగులకు 2022 లో కూడా ఇళ్లలోనే

థాలెట్లు ఎక్కువ కాలం శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బుల‌కు దారితీస్తున్నాయి. దీంతో బాధితులు అకాల మ‌ర‌ణాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించిన బృందానికి హెడ్ లియొనార్డో ట్రాసండె వెల్ల‌డించారు. థాలెట్ల వ‌ల్ల తాము అంచనావేసినదానికంటే ఎక్కువ ప్రమాదమే ఉందని తెలిపారు.