డేంజరస్ యాప్స్ : ఫేస్ బుక్ చేతికి యూజర్ల డేటా

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 03:56 AM IST
డేంజరస్ యాప్స్ : ఫేస్ బుక్ చేతికి యూజర్ల డేటా

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో షాక్‌ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్ల డేటా లీక్‌తో ఇబ్బందులు పడుతున్న ఫేస్‌బుక్‌ మరోసారి ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ ఫామ్ లకు చెందిన 11 ప్రముఖ యాప్స్..యూజర్ల పర్మిషన్ లేకుండానే వారి పర్సనల్ డేటా (వ్యక్తిగత వివరాలు)ను  ఫేస్ బుక్ కు పంపుతాన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ ఆర్టికల్ ను ప్రచురించింది. 
 

ఆ యాప్స్ వినియోగించేవారి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని ఫేస్ బుక్ కు ఈ యాప్స్ చేరవేస్తున్నాయనే ఆ ఆర్టికల్ లో పేర్కొంది. దీంట్లో  మహిళలకు సంబంధించిన పలు రహస్య సమాచారం కూడా ఉందట. ఆ యాప్స్ వినియోగించే యూజర్రలు ఫేస్ బుక్ ను వాడకపోయినా ఇన్ఫర్మేషన్ మాత్రం ఫేస్ బుక్ కు చేరుతోందని తెలిపింది. తాము వ్యక్తిగత సమాచారాన్ని  సేకరిస్తున్న విషయాన్ని యూజర్లకు యాప్స్ స్పష్టం చేయటంలేదని  వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఫేస్ బుక్ అధికార ప్రతినిథి నిస్సా ఆన్ క్లలెసరియా సమర్థించుకున్నారు. మొబైల్ ప్రకటనల కోసం ఈ పద్ధతిని  చాలాకాలంగా వాడుతున్నామని చెప్పారు. తాము ఏ సమాచారాన్ని సేకరిస్తున్నామో యూజర్లకు చెప్పాల్సిన బాధ్యత ఆయా యాప్స్ పైనే ఉందన్నారు. యాప్స్ నుంచి ఇప్పటి వరకూ తాము అందుకున్న సున్నితమైన సమాచారాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు.