US : కమలా హ్యారీస్ హత్యకు మహిళ కుట్ర!

అమెరికా ఉపాధ్యక్షురాలు..కమలా హ్యారీస్ హత్యకు ఓ మహిళ కుట్ర పన్నారు. దీనిని ముందుగాన పసిగట్టిన పోలీసులు కుట్రను భగ్నం చేశారు.

US : కమలా హ్యారీస్ హత్యకు మహిళ కుట్ర!

Kamala

Vice President Kamala Harris : అమెరికా ఉపాధ్యక్షురాలు..కమలా హ్యారీస్ హత్యకు ఓ మహిళ కుట్ర పన్నారు. దీనిని ముందుగాన పసిగట్టిన పోలీసులు కుట్రను భగ్నం చేశారు. దీనికి సంబంధించిన వార్త తీవ్ర కలకలం రేపింది. కమలాను హత్య చేసేందుకు దాదాపు అరకోటి వరకు సుఫారీ తీసుకొందని తెలుస్తోంది. నిందితురాలిని అదుపులోకి తీసుకుని మియామి ఫెడరల్ కోర్టులో హాజరుపరచగా…సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి.

Read More : Evaru Meelo Koteeswarulu : ఇక్కడ నేనే బాస్.. రాజ‌మౌళి, కొర‌టాల‌తో ఎన్టీఆర్ గేమ్ షో..!

దక్షిణ ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన నివియన్ పెటిట్ ఫెల్ప్స్ (39) మహిళ…కమలా హ్యారీస్ ను హత్య చేసేందుకు ఫిబ్రవరిలో కుట్ర పన్నారు. దాదాపు 53 వేల డాలర్లు (రూ. 39 లక్షలు) ఒప్పందం కుదుర్చుకుంది. కేవలం 50 రోజుల్లో కమలాను హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే..కొన్ని విషయాలు మాట్లాడే సమయంలో వీడియో తీసుకుంది. ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయడంతో..హత్యకు పన్నిన కుట్ర బయటపడింది. నిఘా వర్గాలు అప్రమత్తమై..ఆమె కోసం గాలించారు.

Read More : DVAC Raids : మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ దాడులు, విదేశీ కరెన్సీ, 4.9 కిలోల బంగారం స్వాధీనం!

వీడియోను పరిశీలించిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానంలో మియామీని హాజరు పరిచారు. కమల హత్యకు ఆమె తుపాకీ లైసెన్స్ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. కేసును విచారించిన అనంతరం నివియన్ కు ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది.