Earthquakes In Turkey, Syria : శవాల దిబ్బగా టర్కీ, సిరియా.. 4,500 దాటిన మృతుల సంఖ్య

ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి. భూకంపం ధాటికి ఏ శిథిలాన్ని కదిలించినా డెడ్ బాడీలే. పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.

Earthquakes In Turkey, Syria : శవాల దిబ్బగా టర్కీ, సిరియా.. 4,500 దాటిన మృతుల సంఖ్య

Turkey Syria

Earthquakes In Turkey, Syria : ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి. భూకంపం ధాటికి ఏ శిథిలాన్ని కదిలించినా డెడ్ బాడీలే. పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భూకంపంతో ఇరు దేశాల్లో మరణ మృదంగం మోగుతోంది. భూకంప తీవ్రతకు వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంపం దాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 4,500లకు పైగా మంది మృత్యువాత పడగా, వేలాదిగా ప్రజలు గాయపడ్డారు.

టర్కీలో 3 వేల మందికి పైగా మృతి చెందారు. 16 వేల మందికి గాయలయ్యాయి. సిరియాలో 1500 మందికిపైగా దుర్మరణం చెందారు. మరోవైపు టర్కీలో దశల వారి భూప్రకంపనలతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. టర్కీ, సిరియాలో ఎటు చూసిన కూలి పోయిన బిల్డింగుల్లే దర్శనమిస్తున్నాయి. రెండు దేశాల్లోని ప్రాంతాలు శవాల దిబ్బగా మారింది. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

శిథిలాలు తొలగించే కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని, 10 వేలు దాట వచ్చని యూఎన్ జియోలాజికల్ సర్వే చెబుతోంది. టర్కీ, సిరియా సరిహద్దుల్లో నిన్న వరుస పెట్టి మూడు టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు.. 4500లకు చేరిన మృతుల భారీ భూకంపాలు సంభవించాయి.

ఈ భూకంపాల ధాటికి నగరాల్లోని పలు అపార్ట్ మెంట్లు కుప్పకూలాయి. శిథిలాల కింద వేలాది మంది జనం చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగతుున్నాయి. రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. భూకంపాల్లో వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. టర్కీలోని పది నగరాలపై భూకంప ప్రభావం పడింది.