అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23మంది మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : March 4, 2019 / 05:20 AM IST
అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23మంది మృతి

అమెరికాలో మరోసారి టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. అలబామా రాష్ట్రంలోని దక్షిణ లీ కౌంటీలో ఆదివారం(మార్చి-3,2019) రెండు టోర్నడోలు విరుచుకుపడటంతో 23మంది  ప్రజలు చనిపోయారని, చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని, అనేకమంది గల్లంతయ్యారని,గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని లీ కౌంటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్  జే జోన్స్ తెలిపారు. టోర్నడోల ధాటికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.సెల్ ఫోన్ టవర్లు నేలకొరిగాయి. 
Also Read : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ : టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు

వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.ఆదివారం మధ్యాన్నానికి 40మందికి పైగా గాయాలపాలైనవారు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారని, వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తూర్పు అలబామా మెడికల్ సెంటర్ తెలిపింది. గాయాలపాలైన మరికొందరిని స్థానిక హాస్పిటల్స్ కు తరలించారు. చెట్లు కూలి రోడ్లపై పడిపోవడంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా హైవే-51,  లీ రోడ్ 38, దగ్గర టోర్నడో ప్రభావం అధికం ఉందని అధికారులు తెలిపారు. జార్జియా,ఫ్లోరిడా,దక్షిణ కరోలినా ప్రాంతాల్లో కూడా టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు. టోర్నడోల ప్రభావంతో మృతిచెందినవారి కుటుంబాలకు గవర్నర్ కే ఇవాయ్ సానుభూతి తెలిపారు.

Also Read : ఇదే భారతీయత అంటే : ఆకలితో ఉన్న పాక్ ప్రజలకు ఆహారం ఇచ్చిన పంజాబ్ పోలీసులు
Also Read : భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్‌ ఆర్మీ కాల్పులు