Deathstalker Scorpion Venom : విషం నుంచి ప్రాణం కాపాడే ఔషదం.. ఆ తేలు విషానికి భారీగా డిమాండ్, లీటరుకు రూ.84 కోట్లు
ప్రపంచంలో పాములు, తేళ్లు వంటి అనేక రకాల జీవుల్లో విష ఉంటుంది. కొన్ని రకాల విషపూరితమైన పాములు, తేళ్లు కరిస్తే ప్రాణ హాని కూడా ఉంటుంది. కానీ అదే విషం ప్రాణాలను కాపాడే ఔషదం కూడా అవుతుంది. డెత్ స్టాకర్ తేలు విషం కూడా అలాంటిదే. అత్యంత ప్రమాదకరమైన ఈ విషం ద్రవ పదార్థాల్లో అత్యంత విలువైంది.

deathstalker scorpion venom : ప్రపంచంలో పాములు, తేళ్లు వంటి అనేక రకాల జీవుల్లో విష ఉంటుంది. కొన్ని రకాల విషపూరితమైన పాములు, తేళ్లు కరిస్తే ప్రాణ హాని కూడా ఉంటుంది. కానీ అదే విషం ప్రాణాలను కాపాడే ఔషదం కూడా అవుతుంది. డెత్ స్టాకర్ తేలు విషం కూడా అలాంటిదే. అత్యంత ప్రమాదకరమైన ఈ విషం ద్రవ పదార్థాల్లో అత్యంత విలువైంది. ఈ విషానికి భారీగా డిమాండ్ ఉంటుంది. తేలు కుట్టిందంటే పోటు మంటలతో తల్లడి్లిపోతాం. కుట్టిన తేలును బట్టి అస్వస్థతకు గురవ్వడం, కొన్నిసార్లు ప్రాణ హాని కూడా ఉంటుంది. దీనికి కారణం తేలు కొండిలోని విషం. అందులోని న్యూరో ట్యాక్సిన్లు. మన శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే రసాయన పదార్థాలు.
ఈ న్యూరో ట్యాక్సిన్లలో కొన్ని రకాలను అసాధారణ వైద్య చికిత్సలో వినియోగిస్తుంటారు. అందుచేత వాటికి అధిక డిమాండ్ ఉంటుంది. డెత్ స్టాకర్ అనే తేళ్లు.. భూమి మీద ఉన్న తేళ్లన్నింటిలోనూ అత్యంత విషపూరితమైన తేళ్లు. ఇవి ఎక్కువగా ఉత్తర ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తాయి. 10 సెంటిమీటర్ల వరకు పొడవు పెరిగే ఈ తేళ్లు రెండు నుంచి ఆరేళ్ల పాటు జీవిస్తాయి. వీటి విషంలో క్లోరోట్యాక్సిన్ గా పిలవడే అత్యంత అరుదైన రసాయన పదార్థంలోపాటు మరికొన్ని న్యూరోట్యాక్సిన్లు ఉంటాయి. ఈ క్లోరోట్యాక్సిన్ మెదడులోని క్యాన్సర్ కణితులు మరింత విస్తరించకుండా అడ్డుకుంటుంది.
Scorpion Venom: అక్కడ తేలు విషానికి యమ డిమాండ్.. లీటర్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
అంతేకాకుండా మెదడులో క్యాన్సర్ సోకిన కణాలకు మాత్రమే అతుక్కుపోతుంది. దీని వల్ల డాక్టర్లు సర్జరీ చేసి క్యాన్సర్ సోకిన భాగాన్ని లేదా కణాలను పూర్తిగా తొలగిచేందుకు సాధ్యమవుతుంది. సామాన్యంగా సర్జరీ తర్వాత క్యాన్సర్ కణాలు ఏమైనా మిగిలివుంటే వాటి వల్ల మళ్లీ క్యాన్సర్ తిరగబడే ప్రమాదం ఉంటుంది. క్లోరోట్యాక్సిన్ ను మార్కర్ గా వాడటం వల్ల ఈ సమస్య తప్పుతుంది. అయితే డెత్ స్టాకర్ తేలు విషం ధర ఒక లీటర్ కు దాదాపు రూ.84 కోట్లు ఉంటుంది.
ఈ విషంలో అత్యంత అరుదైన న్యూరోట్యాక్సిన్ ఉండటం, సేకరణ అత్యంత కష్టతరమవ్వడం, డిమాండ్ అధికంగా ఉండటంతో దీని ధర ఎక్కువగా ఉంటుంది. ఒక తేలు నుంచి ఒకసారి కేవలం 2 మిల్లీ గ్రాముల విషం మాత్రమే వస్తుంది. ఒక లీటర్ విషం కావాలంటే 10 లక్షల తేళ్ల నుంచి విషం సేకరించాల్సివుంటుంది. పలు చోట్ల ఈ రకం తేళ్లను పెంచుతూ వాటి నుంచి విషాన్ని సేకరించి, విక్రయిస్తారు. సాధారణంగా తేళ్ల నుంచి విషం సేకరించడం కోసం మొదట వాటికి స్వల్పంగా కరెంట్ షాక్ ఇచ్చివాటి విష గ్రంథులను పరికరాలతో నొక్కుతారు.
Snake Venom : అమ్మకానికి పాము విషం- ధర తెలిస్తే……
ఈ సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తేళ్లు గాయపడటం, విష గ్రంధులు పగిలిపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో మొరాకో శాస్త్రవేత్తలు తేళ్ల విషం సేకరణ కోసం ఓ ప్రత్యేక పరికరాన్ని తయారుజేశారు. తేళ్లను మెల్లగా పట్టుకుని, వాటి కొండీలను పరికరంలో పెడతార. కొండిలోని విష గ్రంధుల వద్ద అతి సున్నితంగా కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా వాటంతట అవే విషాన్ని విడుదల చేస్తాయి. తేళ్ల నుంచి కాకుండా పాములు నంచి కూడా విషాన్ని సేకరిస్తారు.
పాములు, తేళ్ల విషంలో ఉండే న్యూరోట్యాక్సిన్లు, ఇతర రసాయన పదార్థాలు మన శరీరంలోని నాడీ వ్యవస్థ, ఇతర అవయవాలపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతాయి. ఒక్కో రకం జీవిలో భిన్నమైన రసాయన పదార్థాలు ఉంటాయి. వాటిలో భిన్నమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాములు, తేళ్లు, ఇతర జీవుల విషం నుంచి సరికొత్త ఔషధాల అభివృద్ధికి పరిశోధనలు జరుగుతున్నాయి. క్యాన్సర్లు, అధిక రక్తపోటు, గుండెపోటు, అల్జీమర్స్, పార్కిన్ సన్స్, చాలా కాలం నుంచి బాధించే నొప్పులు వంటి సమస్యలకు పరిష్కారాలను పరిశోధకులు అన్వేషిస్తున్నారు.