Flower pot Story : పూల కుండీని పగలగొట్టిన డెలివరీ బోయ్.. ఆ తరువాత ఓ లెటర్ రాసి ఏం చేశాడంటే..?
మనవల్ల చిన్న మిస్టేక్ జరిగితే సారీ చెబుతాం. ఓ డెలివరీ బోయ్ ఓ ఇంట్లో అనుకోకుండా పూల కుండీ పగలగొట్టాడు. తన మిస్టేక్ సరిచేసుకోవడం కోసం అతనేం చేశాడు?

Viral News
Viral News : ఎవరి వస్తువైనా పొరపాటున మన చేయి తగిలి పగిలిపోతే ఓ సారీ చెప్పేసి వచ్చేస్తాం. తనవల్ల ఒకరి ఇంట్లో పూలకుండీ పగిలిపోయిందని ఓ డెలివరీ బోయ్ చేసిన పని మాత్రం అందరి మనసుల్ని కదిలించింది.
ఎలీ మెక్‌కాన్ Eli McCann అనే లేడీ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా రాత్రివేళ వాళ్ల కుటుంబం ఫుడ్ కోసం ఆర్డర్ చేసింది. ఫుడ్ పార్సిల్ తీసుకువచ్చిన డెలివరీ బోయ్ పొరపాటున వాళ్ల ఇంట్లోని పూలకుండీని పగలగొట్టాడు. వాళ్లకి సారీ చెప్పి వెళ్లిపోయాడు. ఇది జరిగిన మూడు రోజుల తరువాత ఆ కుటుంబం ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది. మెక్‌కాన్ ఇంట్లో పూలకుండీ ప్రత్యక్షమైంది. దాంతో పాటు ఓ లెటర్ కూడా ఉంది. ఇక మెక్‌కాన్ దంపతులు ఆశ్చర్యపోయారు.
‘నేను ఊబర్ డ్రైవర్ జోర్డాన్‌ను.. మీ ఇంట్లో మూడు రోజుల క్రితం అనుకోకుండా పూలకుండీని పగలగొట్టాను. అది మీకు చాలా సెంటిమెంట్ అని తెలుసుకున్నాను. అందుకే మరో పూలకుండీని మీ ఇంట్లో ఉంచాను. మీ మంచి మనసుకి నా ధన్యవాదాలు’ అని లెటర్‌లో రాశాడు. ‘జోర్డాన్ ఈరోజుల్లో నీలాంటి మంచివారున్నారా?’ అని ఒకరు.. ‘ఈ పోస్టు చూసాక కన్నీరు వచ్చిందని కొందరు’.. ‘జోర్డాన్ సరైన పని చేశాడు’ అని కొందరు కామెంట్లు పెట్టారు. జోర్డాన్ తను చేసిన మంచిపనితో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు.
The food delivery guy just dropped this off. I caught him as I was pulling up to the house and he was so sweet. I told him I tweeted about the interaction and that it went viral and he got a kick out of that. https://t.co/5TXGdwXMbH pic.twitter.com/qcaMZdXSGE
— Eli McCann (@EliMcCann) May 30, 2023