Delta Variant: సాధారణ కొవిడ్‌కు డెల్టా వేరియంట్ మధ్య తేడా

డెల్టా వేరియంట్ లో మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరం, దగ్గు, వాసన లేకపోవడం. మే 21 నుంచి కనిపించిన లక్షణాలు మాత్రం.. తలనొప్పి, గొంతు మూసుకుపోవడం, ముక్కు కారడం వంటివి కూడా కనిపించాయి.

Delta Variant: సాధారణ కొవిడ్‌కు డెల్టా వేరియంట్ మధ్య తేడా

Delta Variant

Delta Variant: డెల్టా వేరియంట్ లో మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరం, దగ్గు, వాసన లేకపోవడం. మే 21 నుంచి కనిపించిన లక్షణాలు మాత్రం.. తలనొప్పి, గొంతు మూసుకుపోవడం, ముక్కు కారడం వంటివి కూడా కనిపించాయి. వీటితో పాటుగా మరో 10లక్షణాలను కనుగొన్నారు లండన్ కింగ్స్ కాలేజీ నిపుణులు.

యూకేలో ప్రస్తుతం మోస్ట్ డామినెంట్ గా మారిన ఈ డెల్టా వేరియంట్ పై రీసెంట్ గా స్టడీ నిర్వహించారు. మే నెల నుంచి ప్రధానంగా కనిపిస్తున్న లక్షణాలు అంతకుముందున్న వాటి కంటే డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ వేరియంట్ తీరు కాస్త భిన్నంగా ఉంది.

దీనిపై ప్రొఫెసర్ స్పెక్టార్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతులైన వారిలో ఎక్కువగా కనిపించిన లక్షణం తీవ్రంగా జలుబు చేయడం. ఇతరులు మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇది చూసి చాలా మంది సీజనల్ జలుబుగా అనుకుంటున్నారు. అలా వెళ్లి పార్టీల్లో ఒకరి నుంచి ఆరుగురికి వైరస్ వ్యాప్తి చేస్తున్నారు. అదే అసలు సమస్య.

ఇతర వేరియంట్ల కంటే డెల్టా వేరియంట్ హైపర్ ఇన్ఫెక్షియస్ గా మారింది. నార్మల్ వేరియంట్ తనతో పాటు ఉన్న ముగ్గురికి ఇన్ఫెక్ట్ చేస్తుండగా డెల్టా వేరియంట్ ఆరుగురికి అంతకంటే ఎక్కువ వ్యాప్తి చేస్తుంది.

ప్రస్తుతం ఈ డెల్టా వేరియంట్.. యూఎస్ ఇన్ఫెక్షన్లలో ఆరు శాతం ఉన్నట్లు తెలుస్తుంది. ఇతర దేశాల్లో మరింత ప్రమాదకరంగా మారింది. రీసెంట్ గా సదరన్ చైనాకు కూడా పాకింది. ఆ చైనా డాక్టర్లే స్టార్టింగ్ లో కనిపించిన కరోనా కంటే ఇది తీవ్రంగా ఉందని తేల్చారు.

ఇండియాలో కొంత మంది డాక్టర్లు డెల్టా వేరియంట్ కారణంగా.. వినికిడి సమస్యలు, కడుపులో ఇబ్బంది, రక్తం గడ్డకట్టడం వంటివి ఉన్నట్లు గుర్తించారు.