Delta Variant: అమెరికాలో డెల్టా వేరియంట్ పంజా.. ఆసుపత్రులు ఫుల్!

ఆ మధ్య అమెరికా మాస్క్ ఫ్రీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో నలభై శాతం వ్యాక్సినేషన్ తో అమెరికా అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది. కానీ, ఇప్పుడు మహమ్మారి డెల్టా వేరియంట్ అగ్రరాజ్యాన్ని మరోసారి వణికిస్తుంది. అప్పుడు మాస్క్ ఫ్రీ ప్రకటించిన ప్రభుత్వమే ఇప్పుడు వ్యక్తిగత కార్యాలయాలలో కూడా మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ప్రకటించాల్సి వచ్చింది.

Delta Variant: అమెరికాలో డెల్టా వేరియంట్ పంజా.. ఆసుపత్రులు ఫుల్!

Delta Variant

Delta Variant: ఆ మధ్య అమెరికా మాస్క్ ఫ్రీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో నలభై శాతం వ్యాక్సినేషన్ తో అమెరికా అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది. కానీ, ఇప్పుడు మహమ్మారి డెల్టా వేరియంట్ అగ్రరాజ్యాన్ని మరోసారి వణికిస్తుంది. అప్పుడు మాస్క్ ఫ్రీ ప్రకటించిన ప్రభుత్వమే ఇప్పుడు వ్యక్తిగత కార్యాలయాలలో కూడా మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ప్రకటించాల్సి వచ్చింది. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా ఇండోర్‌ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలంటూ సీడీసీ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

ముఖ్యంగా ఫ్లోరిడా నగరంలో డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. గతంలో 2020 జులై నెలలో ఇక్కడ ఒక్కరోజులో అత్యధికంగా 10,170 మంది ఆసుపత్రుల్లో చేరగా, ఇప్పుడు 10,207 మంది చేరినట్లు అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం ప్రకటించిందంటే ఇక్కడ ఇప్పటి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. డెల్టా వేరియంట్ సోకితే ఆసుపత్రిలో చేరడమే తథ్యం అన్నట్లుగా ఇక్కడ పరిస్థితి దాపురించింది.

రాష్ట్రాల వారీగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో ఫ్లోరిడా తొలిస్థానానికి చేరుకోగా.. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో ఐసీయూల్లో పడకలు లేక హాల్స్​లోనే బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క అమెరికా మాత్రమే కాదు.. ఆస్ట్రేలియాలో కూడా డెల్టా వేగంగా వ్యాపిస్తుంది. సిడ్నీతో పాటు న్యూ సౌత్​వేల్స్​ రాష్ట్రంలోని పలు నగరాల్లో ఇప్పటికే ఆరు వారాలుగా లాక్ డౌన్ కొనసాగుతుండగా బ్రిస్బేన్​లో ఆగస్టు 8 వరకు లాక్ డౌన్ పొడిగించింది. జర్మనీలో కూడా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని అక్కడి గణాంకాలు చెప్తున్నాయి.