Delta Variant: డెల్టా వేరియంట్ ను అలా వదిలేస్తే మరింత ప్రమాదకరం -WHO

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో డెల్టా వేరియంట్ ఎక్కువగా కనిపిస్తుంది. దీని వ్యాప్తిని అడ్డుకోవాలని లేదంటే మరిన్ని మ్యూటేషన్స్ పుట్టుకొచ్చి వైరస్ ఇంకా ప్రమాదంగా మారుతుందని హెచ్చరించింది డబ్ల్యూహెచ్ఓ.

Delta Variant: డెల్టా వేరియంట్ ను అలా వదిలేస్తే మరింత ప్రమాదకరం -WHO

Who

Delta Variant: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో డెల్టా వేరియంట్ ఎక్కువగా కనిపిస్తుంది. దీని వ్యాప్తిని అడ్డుకోవాలని లేదంటే మరిన్ని మ్యూటేషన్స్ పుట్టుకొచ్చి వైరస్ ఇంకా ప్రమాదంగా మారుతుందని హెచ్చరించింది డబ్ల్యూహెచ్ఓ. కరోనాను అంతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ప్రపంచదేశాలకు సూచించింది.

ఇప్పటి వరకు 132 దేశాల్లో వైరస్ ప్రభావం కనిపిస్తుంది. వైరస్ రూపంతరం చెందుతూ ఇప్పటికే నాలుగు వేరియంట్లుగా మారాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్‌ అన్నారు. ఒకవేళ వైరస్‌ ఇలాగే రూపాంతరం చెందుతుంటే.. మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు వృద్ధి చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. కరోనా కేసులు నాలుగు వారాల్లో సగటున 80 శాతం పెరిగాయని వెల్లడించారు.

ప్రమాదకర స్థాయిలో చెందుతున్న వ్యాప్తికి కరోనా నిబంధనలు అడ్డుకుంటున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగం డైరెక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ వెల్లడించారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటివి నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. వ్యాక్సినేషన్‌ సైతం సమర్థంగా పనిచేయడంతో కేసుల తీవ్రత కాస్త తగ్గింది.

ప్రపంచవ్యాప్తంగా నాలుగు బిలియన్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. ఈ పంపిణీలో అసమానతలే తీవ్ర పరిణామాలు తీసుకొస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు గుర్తించిన ధనిక దేశాల్లో 100 మందిలో 98 డోసులు పంపిణీ అయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ చెబుతుంది. ఆదాయపరంగా అట్టడుగున ఉన్న 29 దేశాల్లో మాత్రం ప్రతి 100 మందిలో 1.6 డోసులు మాత్రమే పంపిణీ చేసినట్లు చెప్పింది.

ఈ 4 బిలియన్ల డోసుల్ని సమానంగా పంపిణీ చేసి ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ముప్పు ఎక్కువ వృద్ధులందరికీ రెండు డోసులు అంది ఉండేవని తెలిపింది. అలా డెల్టా వేరియంట్‌ నుంచి ముప్పు తక్కువగా ఉండేదని తెలిపింది.

ఇప్పటి వరకూ డబ్ల్యూహెచ్‌ఓ సభ్య దేశాల్లో కేవలం సగం మాత్రమే జనాభాలో 10 శాతం మందికి పూర్తిస్థాయి డోసులు అందించాయి. బురుండి, ఎరిత్రియా, ఉత్తర కొరియాలో వ్యాక్సినేషన్‌ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. మహమ్మారిని అంతం చేయడానికి మంత్రాలు లేవని.. వ్యాక్సినేషన్‌ ఒక్కటే అందుకు మార్గమని ర్యాన్‌ స్పష్టం చేశారు.

అగ్రరాజ్యం అమెరికాలో డెల్టా వేరియంట్ ప్రభావం చాలా మందిపై కనిపిస్తుందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ కమిషనర్ స్కాట్ గాట్లీబ్ అంటున్నారు. కొద్ది వారాల్లో స్కూల్స్, కాలేజీలు మొదలుకానుండగా ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితులు సేఫ్ గా అనిపించడం లేదని అన్నారు. మనం తలచుకుంటే కేసులు తక్కువగా అయ్యేట్లు చేయగలమని లేదంటే వైరస్ తీవ్రత పీక్స్ లో చూడాల్సి వస్తుందని వైరాలజీ రీసెర్చర్ జాన్స్ హాప్‌కిన్స్ అభిప్రాయపడ్డారు.