Dominant Strain: ప్రపంచం కరోనా క‌బంద హ‌స్తాల్లోనే ఉంది.. డెల్టా కేసులతో ప్రమాదమే

కరోనావైరస్ అత్యంత ప్రభలబోతుందని, డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య జాతిగా మారబోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది.

Dominant Strain: ప్రపంచం కరోనా క‌బంద హ‌స్తాల్లోనే ఉంది.. డెల్టా కేసులతో ప్రమాదమే

indiawide corona cases upadate

Delta variant: కరోనావైరస్ అత్యంత ప్రభలబోతుందని, డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య జాతిగా మారబోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. డెల్టా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయని, అత్యవసరంగా వ్యాక్సిన్‌ను ఆ వేరియంట్‌కు కనుగొనాల్సిన అవసరం ఉందని డ‌బ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. డెల్టా వేరియంట్ కేసులు ఇలాగే పెరిగితే ఆస్ప‌త్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుంద‌ని, ఆరోగ్య వ్య‌వ‌స్థ‌లు మ‌రోసారి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.

డెల్టా కేసులు విపరీతంగా పెరిగితే, పరిస్థితి విపరీతంగా తయారవుతుందని, చాలా దేశాల‌కు లైఫ్ సేవింగ్ ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డుతుంద‌ని ఆందోళ‌న వ్యక్తంచేసింది WHO. కరోనా తగ్గుముఖం పట్టిందంటూ ప్రజలు అశ్రద్ధ వహించి, టెస్ట్‌లు కూడా చేయించుకోవట్లేదని, ప్ర‌పంచ దేశాల్లో క‌రోనా ప‌రీక్ష‌లు చాలా త‌క్కువ‌గా జ‌రుగుతున్నట్లు WHO చెప్పింద. ముఖ్యంగా అల్పాదాయ‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఆదాయ దేశాల్లో క‌రోనా కొత్త రూపాలు విస్తరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది WHO. అదేవిధంగా 2020 సంవ‌త్స‌రం అంతా న‌మోదైన కేసుల కంటే 2021 తొలి ఐదు నెల‌ల్లో న‌మోదైన కేసులే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వెల్ల‌డించింది.

కరోనా ప్రమాదం తప్పి, ఇబ్బందులు నుంచి బయటపడినట్లు ఇప్పటికే చాలా దేశాలు బావిస్తున్నాయని, కానీ, క‌రోనా క‌బంద హ‌స్తాల్లోనే ప్రపంచం ఉన్నట్లుగా WHO చెబుతున్నది. కొన్ని దేశాల్లో వ్యాక్సినేష‌న్ ఎక్కువ‌గా జ‌రిగింద‌ని, జ‌నాలు తీవ్ర అనారోగ్యాల బారిన‌ప‌డ‌కుండా, మ‌ర‌ణాలు ఎక్కువ‌గా న‌మోదు కాకుండా వ్యాక్సిన్ కాపాడినట్లుగా తెలిపింది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా సాగ‌క‌పోవ‌డం క‌రోనా వ్యాప్తిని పెంచుతుందని WHO అభిప్రాయపడింది.