Delta Variant Lockdowns : డెల్టా ప్లస్ విజృంభణ.. లాక్‌డౌన్‌ దిశగా దేశాలు..!

డెల్టా వేరియంట్‌ ఆందోళనతో ప్రపంచ దేశాలు మరోసారి లాక్‌ వేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పలు దేశాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్ విజృంభిస్తోంది. ముందస్తుగా పలు దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి.

Delta Variant Lockdowns : డెల్టా ప్లస్ విజృంభణ.. లాక్‌డౌన్‌ దిశగా దేశాలు..!

Delta Variant Triggers Lockdowns In Asian And Pacific Countries

Delta Variant lockdowns : డెల్టా వేరియంట్‌ ఆందోళనతో ప్రపంచ దేశాలు మరోసారి లాక్‌ వేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పలు దేశాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్ విజృంభిస్తోంది. దీంతో వైరస్ మళ్లీ ప్రాణాలు తీస్తుందేమోనన్న భయంతో ముందస్తుగా పలు దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తుండగా.. పలు దేశాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి.

ఇప్పటివరకు 85 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయని WHO చెప్తోంది. డెల్టా వేరియంట్ ప్రభావంతో ఇండోనేషియాలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా టెస్టుల సంఖ్యను పెంచింది అక్కడి ప్రభుత్వం. రెండ్రోజుల నుంచి వియత్నాంలోని హో చి మిన్హ్‌ నగరంలో ప్రజలు మళ్లీ సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఇజ్రాయెల్‌ కూడా అలర్ట్ అయింది. మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోనూ డెల్టా వేరియంట్‌ ప్రభావం చూపిస్తోంది. సోమవారం నుంచి ఆ దేశంలో లాక్‌డౌన్ విధించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను వారం రోజుల పాటు మూసివేశారు. కేవలం మెడికల్ ట్రాన్స్‌పోర్ట్‌ను మాత్రమే అనుమతిస్తున్నారు. సౌతాఫ్రికాలో డెల్టా వేరియంట్ విలయతాండవం చేస్తోంది. దీంతో పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో… ఆదివారం నుంచి రెండువారాల పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు డెల్టా వేరియంట్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ఆంక్షలను తిరిగి అమలు చేస్తున్నాయి. ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్ వ్యాప్తితో సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్, డార్విన్ కఠినమైన లాన్ డౌన్ అమలు చేస్తున్నాయి. మలేషియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్టే-ఎట్-హోమ్ ఆర్డర్లను నిరవధికంగా పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. భారతదేశంలో మొట్టమొదట గుర్తించిన డెల్టా వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ నుంచి విమానాలను హాంకాంగ్ అధికారులు నిషేధించారు.