వావ్..! ఎడ్లబండి చక్రం మోడల్ లేఅవుట్‌లో అందమైన పొదరిళ్లు..చూస్తే కళ్లు తిప్పుకోలేం..

వావ్..! ఎడ్లబండి చక్రం మోడల్ లేఅవుట్‌లో అందమైన పొదరిళ్లు..చూస్తే కళ్లు తిప్పుకోలేం..

Denmark architectect build brand garden city : నగరం అంటే ఎలా ఉంటుంది? అని అడిగితే ఠక్కుమని కాంక్రీట్ జంగిల్ లా ఉంటుందని చెప్పేస్తాం. పచ్చని చెట్లు అక్కడక్కడా విసిరేసినట్లుగా కనిపిస్తాయి. ఎక్కడ చూసిన ఆకాశ హర్మాలు కనిపిస్తాయి. ఆకాశాన్ని అంటాయా?!..అన్నట్లుగా అపార్టుమెంట్లు నిలువుగా దూసుకుపోతూ కనిపిస్తాయి. రాత్రి సమయంలో కూడా ఆకాశంలో నక్షత్రాలను చూడలేని పరిస్థితి.

 

 

 

కానీ డెర్మార్క్ లోని ఓ పట్నాన్ని చూస్తే వావ్‌.. వాట్‌ ఏ బ్యూటిఫుల్‌ అనకుండా ఎవరూ ఉండలేరు అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు…ఇది నగరమా? లేక అద్భుతాల ప్రపంచమా? అనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చదనమే..ఎటు చూసినా కళ్లు తిప్పుకోనివ్వని అందాల హరివిల్లుల్లాంటి పొదరిళ్లే కనిపిస్తాయి. మదిని ఏదో కొత్త లోకంలోకి తీసుకెళ్లిపోతాయి…!! ఇండోనేసియాలోని ఓ పల్లెటూరును, డెన్మార్క్‌లోని మరో పట్నాన్ని చూస్తే వావ్‌.. వాట్‌ ఏ బ్యూటిఫుల్‌ అనకుండా ఎవరూ ఉండనే ఉండరు..!

డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హెగాన్‌ ఆనుకుని ఉన్న బ్రాండ్బీ హేవ్‌బీ నగరంలోని ప్లాట్ల లేఅవుట్‌లు అటువంటివే.బండి చక్రం ఆకారంలోని లేఅవుట్‌లో..ఆకుపచ్చని పరిసరాల మధ్య ఉన్న కొలువుదీరిన పొదరిళ్లులాంటి ఇళ్లను చూస్తే కళ్లు తిప్పుకోలేం..అబ్బా..ఇక్కడే ఉండిపోవాలని మనస్సు ఆరాటపడిపోతాం. తెగ ముచ్చటపడిపోతాం.

పురాతన డానిష్‌ గ్రామాల నమూనాతో ఈ ప్రాంతాన్ని 1964లో ఎరిక్‌ మైగిండ్‌ అనే ఆర్కిటెక్ట్‌ అభివృద్ధి చేశాసి..అచ్చం ఎడ్లబండి చక్రంలా ఉండే లేఅవుట్‌లో పొదరిళ్లులాంటి ఇళ్లను నిర్మించారు. ఇటువంటి పలు చక్రాలతో ఏకంగా ఓ పట్టణాన్నే సృష్టించారు. ఆ లే అవుట్లలో ఇళ్లను ఓ లతల్లా రూపొందించి ఒకొక్కదానికి రోడ్లతో అనుసంధానించారు. దీంతో ఆ బండి చక్రాల లేఅవుట్లలో ఉండే ఇళ్ల నిర్మాణాలు ఓ పువ్వుల్లా..అన్నీ కలిపి ఓ అందమైన ముగ్గులా కనిపించి కనువిందు చేస్తాయి..!! పచ్చని హరివిల్లులా ముచ్చటగొలుపుతాయి..!!

చక్రం లేఅవుట్‌ చుట్టూ పచ్చని మొక్కలు ఉంటాయి. మధ్యలో ఇరుసులాంటి ప్రాంతం అంతా ఖాళీగా ఉంటుంది. అక్కడ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా రూపొందించారు. ఇలా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయని ఆర్కిటెక్టులు ఇటువంటి ఆలోచన చేశారు.

ఇళ్ల మధ్య కాంపౌండ్‌ వాల్‌ను కూడా మొక్కలతోనే నిర్మించారు. దీంతో వాల్ కూడా పచ్చదనమే నిండిపోయింది. ఈ లేఅవుట్‌ను ఇటీవల హెండ్రీ డో అనే ఫొటోగ్రాఫర్‌ డ్రోన్‌ సాయంతో ఫొటోలు తీసి ఇన్‌స్టా గ్రాంలో ఉంచాడు. దీంతో ఈ ఇళ్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వైరల్ గా మారి మనం కూడా అక్కడికి వెళ్లిపోతే ఎంత బాగుంటుందో అనుకునే ఉన్నాయా ఇళ్ల నిర్మాణాలు..!!