‘టచ్ చేసి చూడు’:ఆ అమ్మాయిని ’గోకితే‘ కళాఖండాలు పుట్టుకొస్తాయి…

  • Published By: nagamani ,Published On : August 26, 2020 / 11:17 AM IST
‘టచ్ చేసి చూడు’:ఆ అమ్మాయిని ’గోకితే‘ కళాఖండాలు పుట్టుకొస్తాయి…

చర్మం మీద దురద వస్తే..ఠక్కుమని గోకేసుకుంటాం. అలా గోకిన చోట ఎర్రగా కందిపోతుంది చర్మం. కానీ ఓ అమ్మాయికి మాత్రం గోకిన చోట ఏకంగా ఏదో చేయి తిరిగిన కళాకారుడు వేసిన పెయింటింగ్ వేశాడా? అన్నట్లుగా కళాఖండాలు ఏర్పడుతున్నాయి. ఇది వినటానికి ఆశ్చర్యం కలిగించినా నిజంగా నిజం. పాపం ఆ అమ్మాయి అలర్జీ అటువంటిదంట..అలర్జీలో ఈ అలర్జీ వేరయా అన్నట్లుగా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి..ఆ అమ్మాయి పేరు ‘ఎమ్మా అల్డెన్‌రైడ్’. వయస్సు 18 ఏళ్లు. ఉండే ప్రాంతం డెన్మార్క్‌లోని ఆర్హస్. చర్మంమీద గోకితే ఎమ్మాకు అమ్మా..అనిపించేలా..ఆశ్చర్యం కలిగించేలా చర్మం మీద ‘కళాఖండాలు’వంటి షేపులు ఏర్పడతాయి.



చాలామందికి చర్మం మీద అలర్జీలు వస్తుంటాయి. కానీ ఎమ్మా అల్డెన్‌రైడ్ ఉన్న‘టచ్ అలర్జీ’ మాత్రం వెరీ వెరీ డిఫరెంట్ అండ్ మిరాకిల్అని చెప్పాలి. ‘టచ్ అలర్జీ’ అనే అరుదైన అలర్జీతో బాధపడుతోంది ఎమ్మా. అమెను ఎవరైనా పొరపాటున తాకినా ఆ చోటులో వాపు వచ్చేస్తుంది. ఎర్రగా కందగడ్డలా కందిపోతుంది కూడా. బట్టలు వేసుకున్నా ఆ కొద్దిపాటి రాపిడికి కూడా చర్మంపై దద్దర్లు వచ్చేసి ఆమెను తెగ ఇబ్బంది పెట్టేస్తాయి.
https://10tv.in/a-new-study-suggests-covid-19-reinfection-is-possible-heres-what-to-know/
వైద్య పరిభాషలో ఈ సమస్యను ‘డెర్మాటోగ్రాఫియా’ (Dermatographia) అని అంటారని నిపుణులు చెప్పారు. సాధారణంగా అలర్జీ ఉన్నవారు తమకేదో రోగం ఉందని భయపడిపోతుంటారు. కానీ ఎమ్మా మాత్రం అస్సలు ఏమాత్రం భయపడదు. తనకు ఉన్న ఈ అరుదైన సమస్యను తనకు నచ్చిన విధంగా ‘హ్యమన్ ఎట్చ్-ఎ-స్కెచ్’లా మలుచుకుంది.



అంటే.. ఆమె తన చర్మాన్ని కాన్వాస్‌గా మార్చుకుని బొమ్మలను గీస్తోంది. అలా చర్మంపై గీకుతూ కళాఖండాలను ఆవిష్కరిస్తోంది. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఎమ్మాకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే ఈ అలర్జీ ఉందని తెలిసింది. పదే పదే ఆమె చర్మం దురద వస్తోందని, ఎర్రగా కందిపోతుందనే చెప్పడంతో తల్లిదండ్రులు డాక్టర్లకు చూపించారు. పరీక్షించిన డాక్టర్లు ఆమెకు టచ్ అలర్జీ ఉందని..యాంటీహిస్టామినెస్ (Antihistamines) అనే డ్రగ్‌తో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని ఇటీవల వైద్యులు ఎమ్మాకు చెప్పారు. కానీ ట్రీట్ మెంట్ తీసుకోవటానికి ఎమ్మా అంగీకరించలేదు. ఎందుకంటే వాటిని వాడితే అలర్జీ రాదు.. దాని కారణంగా తన చర్మ క్యాన్వాసుపై బొమ్మలు గీయడం కుదరదని మెడిసిన్స్ వేసుకోనని చెప్పింది.

తనకు ఆ అలర్జీ వల్ల ఏమీ ఇబ్బంది లేదనీ..నొప్పిలాంటిది ఏమీ లేదని అటువంటప్పుడు తనకు ఉన్న ఈ సమస్యను తాను ప్లస్ గా మార్చుకోవటంలో తప్పేంటని అంటోంది. కానీ సమస్య ఎక్కువైతే తప్పకుండా ట్రీమ్ మెంట్ తీసుకుంటానంటోంది.కానీ ప్రస్తుతం ఈ అలర్జీ వల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. మున్ముందు ఏమైనా సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎమ్మా ఇకనైనా చర్మంపై బొమ్మలు గీయడం ఆపి.. తగిన చికిత్స పొందితే ఆమెకు మంచిదని ఆమె ఫాలోవర్లు కూడా సూచిస్తున్నారు.