Johnny Depp Defamation Case: హమ్మయ్య.. నాకు కోర్టు తిరిగి జీవితాన్ని ఇచ్చింది.. మాజీ భార్యపై గెలిచిన డెప్

ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన మాజీ భార్యపై వేసిన పరువు నష్టం దావాకేసులో విజయం సాధించారు. జానీ డెప్ మాజీ భార్య, నటి అంబర్ హర్డ్ పై పరువు నష్టం దావా కేసులో డెప్ కు అనుకూలంగా బుధవారం సాయంత్రం వర్జినియాలోని కోర్టు తీర్పునిచ్చింది.

Johnny Depp Defamation Case: హమ్మయ్య.. నాకు కోర్టు తిరిగి జీవితాన్ని ఇచ్చింది.. మాజీ భార్యపై గెలిచిన డెప్

Deep

Johnny Depp Defamation Case: ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన మాజీ భార్యపై వేసిన పరువు నష్టం దావాకేసులో విజయం సాధించారు. జానీ డెప్ మాజీ భార్య, నటి అంబర్ హర్డ్ పై పరువు నష్టం దావా కేసులో డెప్ కు అనుకూలంగా బుధవారం సాయంత్రం వర్జినియాలోని కోర్టు తీర్పునిచ్చింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం కోర్టును జానీ డెప్ కు నష్టపరిహారం కింద 15మిలియన్ డాలర్లు (రూ.116 కోట్లు) చెల్లించాలంటూ అంబర్ హార్డెన్ ను కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో జానీ డెప్ తనను వేధింపులకు గురిచేశాడంటూ అంబర్ హెర్డ్ చేసిన ఆరోపణలను సైతం కోర్టు కొట్టేసింది.

Virender sehwag: ధోనీ చేసిన పనికి రిటైర్మెంట్ ప్రకటిద్దామనుకున్న.. సచిన్ వల్ల అలా చేయాల్సి వచ్చింది.

జానీ డెప్, అంబర్ హెర్డ్ 2011లో తొలిసారి కలుసుకున్నారు. నాలుగేళ్ల తరువాత అంటే 2015లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యం జీవితం 2017 వరకే సాగింది. 2018లో ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో అంబర్ హెర్డ్ ఓ కథనం రాసింది. ఈ కథనంలో తానొక గృహి హింసకు గురైన పబ్లిక్ ఫిగర్‌ను అని చెప్పుకొచ్చారు. అయితే ఆమె జానీడెప్ పేరును ప్రస్తావించలేదు. కానీ ఆ ఆరోపణలను జానీ డెప్ ఖండించారు. 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై జానీడెప్ పరువు నష్టం దావా వేశాడు. అయితే తన మాజీ భర్త జానీడెప్ ఆరోపణలు బూటకమని పేర్కొంటూ 100 మిలియన్ డాలర్లకు అంబర్ హర్డ్ కోర్టులో దావా వేశారు. ఈ తీర్పుల్లో డెప్ కు అనుకూలంగా తీర్పు రావడంతో ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో తన స్పందనను తెలిపాడు. ఈరోజు నాకు సంతోషంగా ఉందని తెలిపాడు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని అన్నారు. నాకు కోర్టు తిరిగి జీవితాన్ని ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు.

Oklahoma: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. నలుగురు మృతి..

కోర్టు తీర్పుపై అంబర్ హర్డ్ తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం మహిళలకు ఎదురుదెబ్బ లాంటిదని అన్నారు. ఈ రోజు నాకు భాదగా ఉందని, నేను మాటల్లో వర్ణించలేనని తెలిపింది. అయితే తాజా కోర్టు తీర్పును సవాలు చేస్తూ పై కోర్టులో అంబర్ హెర్డ్ అప్పీలు చేయనున్నట్లు ఆమె ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉంటే తీర్పును వెలువరిస్తున్నప్పుడు, కోర్టు బయట పెద్ద సంఖ్యలో జానీ అభిమానులు గుమిగూడారు. తమ అభిమాన నటుడికి మద్దతుగా ప్రజలు తమ చేతుల్లో బ్యానర్లు పట్టుకొని నిలబడి ఉన్నారు. ఈ రోజు ఏం తీర్పు వచ్చినా? జానీ, మీరు విజేత. ప్రపంచం మొత్తానికి నిజం తెలుసు అని బ్యానర్లపై రాసి ప్రదర్శించారు.