కరోనా గురించి WHO కు ముందే తెలుసా ?

10TV Telugu News

Did the WHO know about Corona beforehand? : కరోనా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు ముందే తెలుసా..? వైరస్‌ పుట్టుకకు కారణాలు తెలిసినా బయటకు చెప్పలేదా..? నిధులిచ్చే దేశాలు మహమ్మారి విషయంలో ఎన్ని తప్పులు చేసినా ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదా..? సభ్యదేశాలపై కఠినంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా..? డబ్ల్యూహెచ్‌వో అంతర్గత సమావేశానికి సంబంధించిన రికార్డింగ్‌లు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి.WHO అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. కరోనా విజృంభించిన తొలినాళ్లలో ఆ సంస్థ ప్రతినిధులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు, అంతర్గత సమావేశాల్లో వైద్యులు, శాస్ర్తవేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు మధ్య చాలా తేడా ఉన్నట్లు వీటి ద్వారా తెలుస్తోంది. దీంతో డబ్ల్యూహెచ్‌వో వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.ప్రపంచ ప్రజల ఆరోగ్య విషయంలో డబ్ల్యూహెచ్‌వో పాత్ర ఎంతో కీలకం. ఈ సంస్థ ఇచ్చే మార్గదర్శకాలే ప్రపంచ దేశాలకు దిక్సూచి. అయితే మహమ్మారి నేపథ్యంలో WHO వ్యవహారశైలి ఎన్నో విమర్శలకు తావిచ్చింది. నిధులిచ్చే సభ్యదేశాలపై సంస్థ కఠినంగా వ్యవహరించలేదన్న విమర్శలొచ్చాయి. ఇప్పుడు మరోసారి కరోనా పంజా విసురుతున్న క్రమంలో.. సంస్థ అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డింగ్‌లు, పత్రాలు ఓ వార్తా సంస్థకు చిక్కాయి. విమర్శలను బలపరిచేలా ఉన్న ఆధారాలు లభ్యం కావడంతో డబ్ల్యూహెచ్‌వోపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.

10TV Telugu News