మీకు తెలుసా?: కరోనాపై చైనా ఎలా విజయం సాధించిందంటే!

  • Published By: madhu ,Published On : March 21, 2020 / 02:19 AM IST
మీకు తెలుసా?: కరోనాపై చైనా ఎలా విజయం సాధించిందంటే!

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతోంది..ఐతే అసలు వైరస్‌కి పుట్టిల్లు అయినా చైనాలో మాత్రం  కొత్త కేసులు తగ్గిపోయాయ్..దాదాపు 80వేలమందికిపైగా వైరస్ సోకిన చైనాలో ఇప్పుడు కరోనా అంటే భయం లేదు..చైనాకి కరోనాపై కంట్రోల్ ఎలా సాధ్యపడింది.. 

అనూహ్యమైన వేగంతో మానవాళికి ముప్పుగా మారిన కరోనా మహమ్మారిని జయించలేమా… ఎస్ జయించవచ్చు..అదే చేసింది చైనా..అప్పటికే ఆలస్యమైందని కొందరు అనవచ్చు కానీ దాదాపు 80 వేల మందికి సోకిన వైరస్‌ని మూడు నెలల తర్వాత  కంట్రోల్ చేయడం చైనా సాధించిన విజయంగానే చూస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యపడింది. ఇదే ఇప్పుడు ఇటలీ, సౌత్ కొరియా, అమెరికా అంతెందుకు మన భారత్‌కి కూడా సందేహం కలిగించే ప్రశ్న.

కరోనాపై పోరాటం అంటే..ఏం జరిగిందన్నది వదిలేయాలి. ఎలా దాన్ని ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యమని చైనా నేర్పుతోన్న మొదటి పాఠం. వుహాన్‌లో దాదాపు నెల రోజులపాటు కొన్ని వేల మందికి సోకింది కరోనా. ఏ ఒక్క హాస్పటల్‌లోనూ ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదంటే అతిశయోక్తి కాదు. చివరకు పది రోజుల్లోనే వెయ్యి పడకల ఆస్పత్రినీ కట్టాల్సి వచ్చింది. సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు అన్నీ బెడ్స్ ఖాళీ.

See Also | Work From Homeకు రెడీ అవుతున్న Army
ఇంత సమర్ధవంతంగా కరోనాని చైనా కట్టడి చేయడానికి అదివ్యవహరించిన తీరే కారణం.. కరోనా పుట్టిన మొదట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా బాధితుడెవరైనా సగటున 2.6మందికి అంటే దాదాపు ముగ్గురికి ఆ వైరస్‌ని వ్యాపింపజేయగలడని ప్రకటించింది. అలా ఐదారు రోజుల్లో ఒక్కొక్కరు కరోనాని 3500మందికి అంటిస్తారని అంచనా వేసారు. ప్రస్తుతం చైనా మినహా ఇతరదేశాల్లో ఇదే జరుగుతోంది. ఇక్కడే చైనా ఈ వ్యాధి సంక్రమించే వలయాన్ని( సైకిల్‌ని) బ్రేక్ చేసింది. కానీ చైనా తీసుకున్న చర్యలు అనేక విమర్శలకు దారి తీసాయి.

మొత్తం వుహాన్ సిటీని క్లోజ్ చేసింది. ఇతర ప్రపంచంతో అన్ని సంబంధాలు తెంపేసింది. అసలప్పట్లో ఇది సాధ్యమయ్యేపనేనా ?అనే ప్రశ్నలు, సందేహాలు విన్పించాయి. కోటి పదిలక్షలున్న జనాభాని క్వారంటైన్‌ చేయడమంటే మాటలు కాదు. పైగా అది పని చేస్తుందో లేదో కూడా తెలీదు. అయినా..చైనా ముందుకే వెళ్లింది. ప్రపంచ దేశాల విమర్శలను, ప్రశ్నలను పట్టించుకోకుండా ముందుకెళ్లింది. ఇప్పుడదే మార్గాన్ని షట్ డౌన్‌ అని..లాక్ డౌన్ అని ఇతర దేశాలు కూడా ఫాలో అవుతున్నాయి. +

ఇక్కడే ఇలా లక్షలాది మందిని..కోట్లాదిమందిని లాక్ డౌన్ చేయడం నిర్బంధించడం వ్యక్తిగత హక్కులకు భంగం కాదా అని వాదిస్తారు. దేశప్రయోజనాల దృష్ట్యా..పైగా మొత్తం సమాజం భద్రత దృష్ట్యా .. కొన్ని కఠిన చర్యలు తప్పవు. వాటికి స్థానిక ప్రజలు కూడా సహకరించాలి. అప్పుడే తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయి. వైరస్ పుట్ట పగిలిన తర్వాత చరిత్రలోనే అతి పెద్దదైన క్వారంటైన్‌ని వుహాన్‌లో నిర్మించింది. ఫ్యాక్టరీలను మూసేసింది..రవాణా వ్యవస్థలని నిలిపివేసింది. వుహాన్ వాసులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ కఠినమైన..అవసరమైన చర్యతోనే చైనా లక్షల సంఖ్యలో కొత్తగా కేసులు నమోదు కాకుండా అడ్డుకోగలిగింది. వేల సంఖ్యలో మరణాలను నివారించింది.

ఇలా వుహాన్‌లో భారీ క్వారంటైన్ నిర్మించడం ద్వారా..వైరస్ స్ప్రెడ్ అయ్యే సమయాన్ని కూడా చైనా గణనీయంగా తగ్గించింది. దీంతో ఇతర ప్రదేశాల్లోని హాస్పటల్స్‌లో స్టాఫ్ పెంచింది..వారిపై భారం పెరగకుండా చూసింది. కోవిడ్19ని కంట్రోల్ చేయడంలో చైనా ఏం చేసిందనే ఇతర దేశాలు..ప్రత్యేకించి ఇటలీ, యూరప్,అమెరికాలు ఈ అంశాలను అర్ధం చేసుకోవాలి. అంతేకానీ ప్రజల ఆమోదం లేని క్వారంటైన్‌లు సత్ఫలితాన్ని ఇవ్వవని ఆ దేశాలు గ్రహించాలని చైనా చెప్పకనే ఓ పాఠం చెప్తుంది.

క్వారంటైన్‌ అంటేనే తీవ్రమైన ఆంక్షలున్న నిర్బంధం..అది విజయవంతం అవ్వాలంటే ప్రజలు నిజాయితీగా, స్వచ్ఛందంగా సహకరించాలి..ఇలా వుహాన్ వాసులు సహకరించారు కాబట్టే..చైనా కరోనాని కంట్రోల్ చేయడంలో సూపర్ సక్సెస్ అయిందనాలి..రోజులు..వారాలు..నెలలు ఇలా ఎంతో ఓపికగా..ఇళ్లలోనే ఉండిపోయారు. అదే సమయంలో వారికి అవసరమైన నిత్యావసరాలను కూడా చైనా ఇంటికే పంపించింది. 

దేశాలు వేరైనా మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు పరిస్థితులు ఒకేలా ఉంటాయి. ఆయా దేశాల్లోని వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లు..ప్రజలు అందరూ కలిసి పోరాడాల్సిందే..అవసరం వచ్చిన సమయంలో అవసరమైన కఠినమైన చర్యలే తీసుకోవాలి..అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటి ముందూ ఒకటే సమస్య ..కరోనాని కట్టడి చేయడమెలా..ఈ సమస్యకి పరిష్కారం వెదకడంలో రాజకీయాలకు తావివ్వకూడదు. ట్రంప్ ఉద్దేశంలో కరోనాని కట్టడి చేయడమంటే..బోర్డర్లు మూసేస్తేచాలనుకున్నారు..బ్రిటన్ ప్రధాని బోరిస్ అందరికీ ఉచితంగా వైద్యం అందించడం ద్వారా కరోనాని నివారించవచ్చనుకున్నారు.

సింగపూర్‌ ప్రతి బాధితుడినీ వదలకుండా చికిత్స చేయడమేపరిష్కారమనుకుంది..ఇలా ఏ దేశానికి ఆ దేశం కరోనాపై యుద్ధం చేస్తోంది..ఈ క్రమంలో కొంతమంది భారీ మూల్యం చెల్లించుకున్నారు. మరి కొంతమంది సక్సెస్ అయ్యారు..ఎలాగైతేనే ప్రపంచమంతా..ఇప్పుడు ఎలా సమస్యని ఎదుర్కోవాలో నేర్చుకుంది….ఇప్పటికీ చైనాలో కొత్త కేసులు నమోదు కావచ్చు..మరణాలూ సంభవించవచ్చు కరోనాని కట్టడి చేయడంలో ప్రపంచానికి ఓ స్ఫూర్తి దాయక పాఠం నేర్పిందడనంలో సందేహం లేదు. బహుశా ఇదే పద్దతిని ఇప్పుడు మోదీ కూడా భారత్‌లో చేపట్టాలని ప్రయత్నిస్తుండవచ్చు.. జనతా కర్ఫ్యూ దానికి సంకేతంగానే చూడాలంటున్నారు. ఆయన జనతా కర్ఫ్యూ ప్రకటించిన సమయంలోనే ఆస్పత్రులకు అత్యవసరమైతేనే వెళ్లండని సూచించడం కూడా ఈ వ్యూహంలో భాగంగా చెప్పుకోవాలి.

Read More ; అయ్యో కరోనా ఎంత పని చేసింది..జనరల్ బజార్ వెలవెల