Ashraf Ghani : వేల కోట్లతో పారిపోవడం అబద్ధం.. బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు

యూఏఈకి భారీగా డబ్బుతో పారిపోయారన్న పుకార్లను అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) కొట్టిపారేశారు.

Ashraf Ghani : వేల కోట్లతో పారిపోవడం అబద్ధం.. బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు

Didn't Take Money, Couldn't Even Change Shoes, Says Ashraf Ghani

Ashraf Ghani : యూఏఈకి భారీగా డబ్బుతో పారిపోయారన్న పుకార్లను అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) కొట్టిపారేశారు. ఆ వాదనలన్నీ నిరాధారమైనవని, అంతా అబద్దమన్నారు.. తాను పారిపోయి రాలేదన్నారు.. అప్ఘాన్ కు ఎదురయ్యే భారీ విపత్తును తప్పించేందుకు యూఏఈ వచ్చేశానని ఘనీ స్పష్టం చేశారు. అష్రఫ్ ఘనీ(72) తమ దేశానికి శరణార్థిగా వచ్చినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) వెల్లడించింది. అప్ఘాన్ రాజధాని కాబుల్‌ను గత వారమే తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాలిబన్ల ఆక్రమణతో అధ్యక్షుడు ఘనీ దేశం వదిలి వెళ్లారు. తమ దేశానికి శరణు కోరి వచ్చిన ఘనీ, ఆయన కుటుంబాన్ని మానవతా దృష్టితో దేశంలోకి ఆహ్వానించామని యూఏఈ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. యూఏఈ చేరుకున్న అనంతరం అష్రఫ్ ఘనీ ఫేస్‌బుక్‌లో తన మొదటి సందేశాన్ని పోస్ట్ చేశారు. ఘనీ నాలుగు కార్లు, నగదుతో నింపిన హెలికాప్టర్‌తో సహా విదేశాలకు పారిపోయినట్టు పుకార్లు చక్కర్లు కొట్టాయి.

అయితే ఈ వాదనలన్నీ నిరాధారమైనవని, ఎందుకంటే రక్తపాతాన్ని నివారించడానికి తనను దేశాన్ని విడాల్చి వచ్చిందని వీడియో సందేశంలో ఘనీ వివరణ ఇచ్చారు. అసలు తన బూట్లు మార్చుకోనేందుకు కూడా తాలిబన్లు సమయం ఇవ్వలేదని ఘనీ తెలిపారు. రాష్ట్రపతి భవనంలో తాను ధరించిన చెప్పులతోనే కాబూల్ నుంచి బయలుదేరి వెళ్లినట్టు ఘనీ వివరించారు. ఒక అధ్యక్షుడిగా ఉండి.. దేశాన్ని తాలిబన్లకు తాకట్టుబెట్టి స్వలాభం కోసం, తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడని ఎవరు చెప్పినా నమ్మవద్దని అప్ఘాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. నేను అప్ఘానిస్తాన్ నుంచి బహిష్కరణకు గురయ్యాను. కనీసం చెప్పులు కూడా వేసుకునే కూడా అవకాశం లభించలేదన్నారు. ప్రస్తుతానికి తాను ఎమిరేట్స్‌లో ఉన్నానని చెప్పారు. దేశం విడిచి వెళ్లిపోవడం వల్లే అనవసర రక్తపాతం, గందరగోళం ఆగిందని పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్‌కు తిరిగి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నానని వెల్లడించారు.
Afghanistan: కార్లు,హెలికాఫ్టర్ నిండా డబ్బుతో..అప్ఘానిస్తాన్ నుంచి పారిపోయిన ఘనీ

తాలిబాన్లతో యుద్ధం ముగియలేదు :
దేశాన్ని విడిచిపెట్టి వెళ్లినందుకు అఫ్గానిస్తాన్‌లోని ఇతర రాజకీయ నేతలు ఘనీపై తీవ్ర విమర్శలు చేశారు. ఘనీ 16.9 కోట్ల డాలర్ల (సుమారు 1257 కోట్ల రూపాయల) డబ్బుతో పారిపోయారని తజికిస్తాన్‌లోని అఫ్గాన్ రాయబారి మొహమ్మద్ జహీర్ అగ్బర్ ఆరోపించారు. ఘనీ స్వదేశానికి, అఫ్గాన్ జాతిని మోసం చేశారని ఆరోపించారు. తమ రాయబార కార్యాలయం అప్ఘాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్‌ను అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అధ్యక్షుడు పారిపోవడంతో తానే అఫ్గానిస్తాన్‌కు చట్టబద్ధమైన కేర్‌టేకర్ ప్రెసిడెంట్‌ గా అమ్రుల్లా సాలేహ్ ప్రకటించుకున్నారు. అలాగే తాలిబాన్లతో యుద్ధం ముగియలేదని చెప్పారు. పారిపోయిన అఫ్గాన్ ప్రభుత్వంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం విమర్శలు గుప్పించారు. ఘనీ ఇక అప్ఘానిస్తాన్‌లో గుర్తింపు పొందిన నాయకుడు ఏ మాత్రం కాదని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ షెర్మన్ పేర్కొన్నారు. అప్ఘానిస్తాన్ ప్రభుత్వ పగ్గాలు చేతులు మారకపోవడంతో ప్రస్తుతానికి అమెరికా ఆయన్ను ‘ప్రెసిడెంట్ ఘనీ’ అని పిలుస్తోంది.
Afghanistan President : అష్రఫ్ ఘనీ తమ దేశంలో ఉన్నాడన్న యూఏఈ

తనను భద్రతా బృందం ప్రెసిడెంట్ ప్యాలెస్ నుంచి సురక్షితంగా తరలించిందని ఘనీ ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించారు. అప్పుడు తనకు కనీసం బూట్లు వేసుకునే సమయం కూడా లేదన్నారు. తాలిబాన్‌తో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించినట్టు చెప్పారు. తాలిబాన్లతో, అధికారులు చర్చలు జరిపేందుకు మొగ్గుచూపిన విషయాన్ని వెల్లడించారు. తమ దేశంలో తలదాచుకునేందుకు పారిపోయి వచ్చిన విదేశీ నేతలకు యూఏఈ ఆశ్రయం కల్పించడం తొలిసారి కాదు. 1990లో పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో దుబాయ్‌కి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆయన తిరిగి పాకిస్తాన్ వెళ్లిపోయారు. 2014లో అప్ఘానిస్తాన్‌లో ఘనీ అధికారంలోకి వచ్చారు. 2020 ఫిబ్రవరిలో రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు.