DIGITAL బిచ్చగాడు : ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడమే టార్గెట్

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 09:38 AM IST
DIGITAL బిచ్చగాడు : ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడమే టార్గెట్

బిచ్చగాళ్లని గుమ్మం ముందో.. గుడి మెట్ల మీదనో.. వీధిలో ఓ మూలనో  చూస్తుంటాం. కానీ, ట్రెండ్ మార్చి ట్విట్టర్‌లో అడుక్కోవడం చూశారా.. నవ్విస్తూనే అబద్దాలు చెప్తూ సాయం పేరు చెప్పి డబ్బులు కాజేయడం చూశారా.. తీరిగ్గా కూర్చొని లక్షల్లో సంపాదిస్తున్నవాడే ఈ డిజిటల్ బెగ్గర్. కల్లబొల్లి మాటలు చెప్పి కులాశాగా గడిపేస్తున్నాడు.  

పాతికేళ్ల జొవాన్ హిల్ న్యూయార్క్‌‌లోని బ్రూక్లైన్‌లో ఉంటున్నాడు. అతని సంపాదన నెలకు రూ.5 లక్షలకు పైనే. చిన్నవయస్సులోనే చదువుకు గుడ్ మై చెప్పేసిన జోవాన్..ఆన్ లైన్ బెగ్గింగ్‌కు ముందు ఓ రెస్టారెంటులో పనిచేసేవాడు. అక్కడ అతనికి నెలకు 965 పౌండ్స్ అంటే మన కరెన్సీలో రూ.87 వేలు వచ్చేవి. జల్సా ఖర్చులకు ఆ డబ్బులు సరిపోలేదు. అందుకే కొత్త దందా మొదలుపెట్టాడు.

ఓ రోజు డబ్బులు కావాలంటూ తన ఫాలోవర్స్‌కి అకౌంట్ నెంబర్ షేర్ చేశాడు. 24గంటల్లో అతని ఖాతాలో 400 పౌండ్స్ అంటే రూ.37 వేలు పడిపోయాయి. తేరగా కూర్చొని డబ్బులు దండుకోవడం బాగా నచ్చింది. దీంతో పర్సనల్‌గా చాటింగ్ చేసేవాడు. ఒక్కొక్కరినీ విడివిడిగా అవసరాలు పేరు చెప్పి డబ్బులు అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఎంతలా సంపాదించాడంటే జొవాన్ ఉంటున్న ఇంటి అద్దెను కూడా తామే భరిస్తామంటూ దాతలే ముందుకు వచ్చారు. 

 

జొవాన్‌కు అమెరికా నుంచి సింగపూర్ వరకు లక్షల్లో ఉన్న ఫాలోవర్లను సెన్సాఫ్ హ్యూమర్‌తో నవ్విస్తుంటాడు. అతని కామెడీ నచ్చి కొందరు ఒక డాలర్ నుంచి వంద డాలర్లు వరకు బిచ్చమేస్తారు. అలా.. నెలకు రూ.5 లక్షలకు పైగా ఇన్ కమ్ సంపాదిస్తున్నాడు. ఈ బిచ్చగాడి డ్రీమ్ ఏంటంటే.. ఏదో ఒక రోజు ఫోర్బ్స్ జాబితాలో సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా స్థానం సాధించాలనేది జోవాన్ లక్ష్యమట!