ఎంత అవమానకరం : ట్రంప్ టెంపరితనంపై ప్రపంచ నేతలంతా ఫైర్.. ట్విట్టర్‌లో ఏకిపారేస్తున్నారు!

ఎంత అవమానకరం : ట్రంప్ టెంపరితనంపై ప్రపంచ నేతలంతా ఫైర్.. ట్విట్టర్‌లో ఏకిపారేస్తున్నారు!

Disgraceful-World Leaders Boris Johnson on US Capitol Siege : డొనాల్డ్ ట్రంప్ టెంపరితనం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతిదానికి ట్రంప్ నోరుపారేసుకోవడం షరామూములే. అమెరికా ప్రెసిడెంట్​గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్​ అనుసరించిన తీరు, ఆయన వైఖరితో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. పాలసీల్లో.. మాట తీరులో ఆయన దురుసుతనం అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.

మైనార్టీల విషయంలోనే కాదు.. మైగ్రెంట్స్​ విషయంలోనూ ఆయన నిర్ణయాలు వివాదాస్పదానికి దారితీశాయి. మైనార్టీలు, మైగ్రెంట్స్​కు ట్రంప్​ వ్యతిరేకి అన్న భావన బలంగా ముద్రపడింది. చివరికి అమెరికా అధ్యక్ష పదవి చేజారి బైడెన్ హస్తగతమైంది. ఓటమిని ఒప్పుకోలేని ట్రంప్.. తన అక్కసును తన మద్దతుదారులను రెచ్చగొట్టి అమెరికా పార్లమెంటుపై దాడికి పురిగొల్పారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కట్టడిలో ట్రంప్​ ఫెయిలయ్యారని, కనీసం ఆయన మాస్క్​ కూడా ధరించరని విమర్శలు వస్తున్నాయి.

ట్రంక్ ఇకనైనా మారరా? అధ్యక్ష పదవి నుంచి దించేసినా ట్రంప్.. టెంపరితనం.. నోటి దురుసతనం ఇంకా తగ్గలేదా అంటున్నారు ప్రపంచ నేతలు.. అమెరికా పార్లమెంటుపై దాడి ఘటనను హేయమైన చర్య అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ తన మద్దతుదారులను క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. ‘ఇది నిరసన కాదు.. రాజకీయ తిరుగుబాటు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి ఇతర ప్రపంచ నేతలంతా అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ట్రంప్ టెంపరితనంపై ట్విట్టర్ వేదికగా ఏకిపారేస్తున్నారు.
‘ఎంత అవమానకారం.. అమెరికా క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడతారా? ఇలాంటి హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా..’ అంటూ బోరిస్ ట్వీట్ చేయగా.. ఆస్ట్రియా ఛాన్సలర్ సెబాస్టియన్ క్యుర్జ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారం మారాల్సిన అవసరం ఉందని అన్నారు.

కెనడా ప్రధాని జస్టిన్ Trudeau కూడా తీవ్రంగా ఖండించారు. విచారించాల్సిన ఘటన.. ఇది.. అమెరికాలో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.

NATO సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బెర్గ్ కూడా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామబద్ధంగా జరిగిన ఎన్నికల తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందేనన్నారు.

కొత్త అధ్యక్షుడు జో బైడెన్ పై స్పానీష్ ప్రధాని పెడ్రో శాంచెజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలను ఐక్యంగా చేయడంలో బైడెన్ సమర్థులంటూ ఆయన ట్వీట్ చేశారు.

నార్వే ప్రధాని ఎర్నా సోల్ బర్గ్ కూడా ట్విట్టర్ వేదికగా ట్రంప్ తీరును ఏకిపారేశారు. వాషింగ్టన్ డీసీలో నిరసన ఆందోళలను ట్రంప్ వెంటనే నిలిపివేయాల్సిందిగా కోరారు.

స్కాటిష్ ప్రధాని నికోలా స్టర్జన్, ఐర్లాండ్ ప్రధాని మిచెల్ మార్టిన్ కూడా అమెరికా ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు.