Xi Jinping: చైనా మాజీ అధ్యక్షుడి మరణంతో జిన్‭పింగ్‭లో కలవరం

జియాంగ్ పరిపాలించిన 1990వ దశకంలో రాజకీయ స్వేచ్ఛ గురించి కనీసం బహిరంగంగా చర్చించే అవకాశం ఉండేదని, మళ్లీ ఆ రోజులు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జియాంగ్ మరణించినట్లు బుధవారం ప్రకటించిన వెంటనే ప్రజలు ఆన్‌లైన్‌లో ఆయనకు నివాళులర్పించడం ప్రారంభించారు. ఆయన జీవిత కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజాదరణను పొందకపోయినప్పటికీ, ఆయన పరిపాలనను, ప్రస్తుత జిన్‌పింగ్ పాలనతో పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Xi Jinping: చైనా మాజీ అధ్యక్షుడి మరణంతో జిన్‭పింగ్‭లో కలవరం

Disturbed by the death of the former president of China, Xi Jinping

Xi Jinping: చైనా కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నేతల మరణం ఆ దేశాన్ని నడిపించే నాయకులకు సవాళ్లు విసురుతోంది. గతంలో ఇద్దరు నేతల విషయంలో అదే జరిగింది. ఆ పార్టీ అగ్ర నేత చౌ ఎన్‌లై 1976లో మరణించినపుడు పెద్ద ఎత్తున అసమ్మతి, నిరసన వ్యక్తమైంది. మరో అగ్ర నేత హు యవోబాంగ్ 1989 ఏప్రిల్‌లో మరణించిన తర్వాత తియానన్మెన్ స్క్వేర్ నిరసన ఉద్యమం వచ్చింది. వీరి అనంతరం జియాంగ్ జెమిన్.. చైనా అధ్యక్షుడితో పాటు దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయన మరణించారు. దీంతో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటనే డైలమాలో పడిపోయారు ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‭పింగ్.

వాస్తవానికి ఈ పరిస్థితి చైనాలో కనిపించినట్టే కనిపిస్తోంది. కొవిడ్ నిబంధలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనాలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి ఎంత వరకు వెళ్తుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. దేశంలోని ప్రస్తుత పరిణామాలపై ప్రజలు తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కేందుకు జియాంగ్ మరణాన్ని ఓ సాకుగా తీసుకుంటారా? అనే ఆందోళన జిన్‭పింగ్‭లో కనిపిస్తోందని అంటున్నారు. హు యవోబాంగ్‌కు అప్పట్లో అత్యధిక ప్రజాదరణ ఉండేది. ఆయనతో పోల్చితే జియాంగ్ జెమిన్‌కు అంత ప్రజాదరణ లేదు.

Supreme Court: సుప్రీంలో నేటి బెంచ్ ఒక బెంచ్ మార్క్.. మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం

అయితే జియాంగ్ చైనా అధ్యక్షునిగా పని చేసిన సమయంలో ప్రజలు కనీసం తమ కష్టాల గురించి బహిరంగంగా చర్చించుకునే అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుతం జిన్‌పింగ్ పరిపాలనలో నియంతృత్వంతో సాగుతోందని, సెన్సార్‌షిప్, భావజాలపరమైన నియంత్రణలను నూతన శిఖరాలకు తీసుకెళ్ళారనే విమర్శ ఉంది. కోవిడ్-19 మహమ్మారి నియంత్రణ పేరుతో అమలు చేస్తున్న కట్టుదిట్టమైన ఆంక్షలు ఇందుకు ఉదహారణగా కూడా చూపిస్తున్నారు. 1989 తర్వాత ఎన్నడూ కనిపించని వ్యతిరేకత ప్రస్తుతం ప్రజల్లో కనిపిస్తోంది.

జియాంగ్ పరిపాలించిన 1990వ దశకంలో రాజకీయ స్వేచ్ఛ గురించి కనీసం బహిరంగంగా చర్చించే అవకాశం ఉండేదని, మళ్లీ ఆ రోజులు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జియాంగ్ మరణించినట్లు బుధవారం ప్రకటించిన వెంటనే ప్రజలు ఆన్‌లైన్‌లో ఆయనకు నివాళులర్పించడం ప్రారంభించారు. ఆయన జీవిత కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజాదరణను పొందకపోయినప్పటికీ, ఆయన పరిపాలనను, ప్రస్తుత జిన్‌పింగ్ పాలనతో పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

#GujaratElections: వివాహం జరగగానే పెళ్లి పందిరి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి జంట