‘Do Not Open’Warns Tomb :‘దీన్ని తెరిస్తే ఛస్తారు‘ 1,800 ఏళ్లనాటి సమాధిపై హెచ్చరిక

1,800 ఏళ్లనాటి సమాధిపై ఎర్రిటి అక్షరాలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈ సమాధిని తెరవొద్దు..తెరిస్తే అంటూ ఉన్న హెచ్చరికను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.

‘Do Not Open’Warns Tomb :‘దీన్ని తెరిస్తే ఛస్తారు‘ 1,800 ఏళ్లనాటి సమాధిపై  హెచ్చరిక

‘do Not Open’warns Tomb

‘Do Not Open’Warns Tomb Discovered In Israel : చరిత్రలో కలిసిపోయిన ఎన్నో రహస్యాలను వెలికి తీయటానికి పురావస్తు శాస్త్రవేత్తలు ఎన్నో తవ్వకాలు చేస్తుంటారు. దీంట్లో భాగంగా పురాతన సమాధుల్ని కూడా తవ్వి అది ఎప్పటిదో..దానికి సంబంధించిన విశేషాలు ఏమున్నాయో తెలుసుకుంటుంటారు. అలాగే ప్రాచీన సమాధుల్ని తవ్వే క్రమంలో ఇజ్రాయెల్‌లో ఓ సమాధిని చూసిన శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ సమాధిమీద ఓ హెచ్చరిక రాసి ఉంది. ఆ అక్షరాలు చూసిన శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు.

ఇజ్రాయెల్‌లోని గలీలీ ప్రాంతంలో గల బెయిట్‌ షెయారిమ్‌ యూదు ఖననవాటికలో ఇటీవల పురావస్తు శాస్త్రజ్ఞులు ఓ గుహను కనుగొన్నారు. అందులో బయటపడిన సమాధి రాతి పలకపై ఓ హెచ్చరిక చూసిర శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.ఆ సమాధిమీద ‘ఈ సమాధిని ఎవరైనా తెరిస్తే శాపానికి గురవుతారు. ఇది మతాంతరీకరణ పొందిన జాకబ్‌ ఆన’ అని తెల్లని రాతిపలకపై ఎర్రని అక్షరాలతో భయానకంగా రాసిన ఆ హెచ్చరిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

జాకబ్‌ బహుశా రోమన్‌ సామ్రాజ్యం చివరి రోజుల్లో లేదా బైజాంటియం యుగం తొలినాళ్లకు చెందిన 1,800 ఏండ్లనాటి ఆ సమాధిపై జాకబ్‌ వయసు చనిపోయేనాటికి 60 సంవత్సరాలని కూడా రాసి ఉంది. ఇజ్రాయెల్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఈ వార్త వెలువరించారు. దీనిపై నెటిజనులు వారి వారి స్టైల్లో కామెంట్లు రాసుకొస్తున్నారు.